రాజమండ్రిలో ‘భారతీయుడు-2’

Tue,September 17, 2019 11:33 PM

కమల్‌హాసన్‌ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘భారతీయుడు-2’. శంకర్‌ దర్శకత్వం వహిస్తున్నారు. 23 ఏళ్ల క్రితం సంచలనం సృష్టించిన ‘భారతీయుడు’ చిత్రానికి సీక్వెల్‌ ఇది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రి సెంట్రల్‌జైల్లో చిత్రీకరణ జరుగుతున్నది. కమల్‌హాసన్‌తో పాటు ఇతర ప్రధాన తారాగణం పాల్గొనగా కీలక సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. ఈ షెడ్యూల్‌ ముగిసిన వెంటనే విదేశాల్లో చిత్రీకరణ జరపనున్నారు. ఈ చిత్రంలో కాజల్‌ అగర్వాల్‌ కథానాయికగా నటిస్తున్నది. సమకాలీన సామాజిక, రాజకీయ అంశాల్ని చర్చించబోతున్న ఈ సినిమాపై కమల్‌హాసన్‌ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. రకుల్‌ప్రీత్‌సింగ్‌, సిద్ధార్థ్‌, ప్రియాభవానిశంకర్‌, ఐశ్వర్యరాజేష్‌ తదితరులు కీలక పాత్రల్ని పోషిస్తున్నారు.

796

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles