వంద రూపాయలతో మొదలై..


Wed,January 16, 2019 11:39 PM

Best In The Business With Prasad Group Chairman Akkineni Ramesh Prasad

తెలుగు సినిమాకు కొత్త సొబగుల్ని అద్దిన తొలితరం దర్శకనిర్మాతల్లో ఎల్.వి. ప్రసాద్ ఒకరు. టాకీ సినిమాలతో తన ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆయన నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా బహుముఖప్రజ్ఞాశాలిగా కీర్తిని గడించారు. నేడు ఆయన 111వ జయంతి. ఎల్.వి ప్రసాద్ సినీ ప్రయాణాన్ని గురించి ఆయన తనయుడు రమేష్‌ప్రసాద్ వెల్లడిస్తూ నాన్న పెద్దగా చదువుకోలేదు. తెలుగు తప్ప మరో భాష తెలియదు. కానీ సినిమాలపై ఇష్టంతో కేవలం వంద రూపాయలతో ముంబాయిలో అడుగుపెట్టారు. గేట్‌కీపర్, ఆఫీస్‌బాయ్, అసిస్టెంట్ కెమెరామెన్, సహాయదర్శకుడు, నటుడు.. ఇలా ఉపాధి కోసం అనేక పనులు చేశారు. ఎన్నో కష్టాలను ఎదుర్కొని సినిమా రంగంలో స్థిరపడ్డారు. గృహప్రవేశం, బిదాయి, మిలాన్, మిస్సమ్మ, పల్నాటి యుద్ధం వంటి తెలుగు, హిందీ, తమిళ భాషల్లో పలు సినిమాల్ని తెరకెక్కించి దర్శకనిర్మాతగా ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్రవేశారు నాన్న గేట్‌కీపర్‌గా పనిచేసిన థియేటర్‌లోనే ఆయన దర్శకత్వం వహించిన హిందీ చిత్రం కిలోనా ఇరవై ఐదు వారాలు ఆడింది అని తెలిపారు.

2144

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles