పల్లెటూరి అనుబంధాలు

Fri,October 18, 2019 12:29 AM

సీనియర్ నటి అన్నపూర్ణ, మాస్టర్ రవితేజ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం అన్నపూర్ణమ్మగారి మనవడు. శివనాగేశ్వరరావు (శివనాగు) దర్శకుడు. ఎమ్మెన్నార్ చౌదరి నిర్మిస్తున్నారు. చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. దర్శకుడు చిత్ర విశేషాలు తెలియజేస్తూ ఏపీలోని వైకుంఠపురం అనే గ్రామంలో చిత్రీకరణ జరిపాం. అన్నపూర్ణమ్మ మనవడిగా మాస్టర్ రవితేజ నటించారు. పల్లెటూరి అనుబంధాలు, ఆత్మీయతలు, ప్రేమల్ని ఆవిష్కరించే చిత్రమిది. ముద్దపప్పు, ఆవకాయ సమ్మేళనంతో భోజనం ఎంత రుచికరంగా ఉంటుందో..ఈ సినిమా కూడా అదే స్థాయిలో ప్రేక్షకుల్ని మెప్పించే విధంగా ఉంటుంది అన్నారు. నవంబర్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని నిర్మాత తెలిపారు. బెనర్జీ, బాలాదిత్య, రఘుబాబు, జీవా, తాగుబోతు రమేష్, రఘు కారుమంచి, సుమన్‌శెట్టి తదితరులు చిత్ర తారాగణం.


320

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles