అన్నపూర్ణమ్మ మనవడి కథ


Tue,August 6, 2019 12:51 AM

Annapurnamma Gari Manavadu Movie First Look Launch

సీనియర్ నటి అన్నపూర్ణమ్మ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం అన్నపూర్ణమ్మగారి మనవడు. నర్రా శివనాగేశ్వరరావు దర్శకుడు. యం.ఎన్.ఆర్.చౌదరి నిర్మాత. మాస్టర్ రవితేజ టైటిల్‌రోల్‌ని పోషిస్తున్నాడు. సీనియర్ నటి జమున కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను సోమవారం నిర్మాత సి.కల్యాణ్ విడుదల చేశారు. దర్శకుడు చిత్ర విశేషాలు తెలియజేస్తూ పల్లెటూరి నేపథ్యంలో సాగే కథ ఇది. అనుబంధాలకు దర్పణంగా ఉంటుంది. అన్నపూర్ణమ్మగారి సోదరి పాత్రలో జమునగారు నటించారు అన్నారు. ఈ సినిమాలో అన్నపూర్ణమ్మ, జమున వంటి లెజెండరీ నటీమణులు భాగం కావడం అదృష్టంగా భావిస్తున్నాను. ర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. సెప్టెంబర్‌లో ఆడియో, అక్టోబర్‌లో సినిమాను విడుదల చేస్తాం అని నిర్మాత తెలిపారు.

327

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles