కావేరి పరిరక్షణకు పిలుపు

Tue,September 17, 2019 11:29 PM

కావేరి నదిని పునరుద్ధరించడానికి ఇషా ఫౌండేషన్‌ వ్యవస్థాపకులు జగ్గీవాసుదేవ్‌ ‘కావేరి పిలుపు’ ఉద్యమాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. రాబోవు పన్నెండేళ్లలో కర్ణాటక, తమిళనాడు రాష్ర్టాల్లోని కావేరి నది పరీవాహక ప్రాంతాల్లో 242 కోట్ల మొక్కలు నాటాలన్నది ఉద్యమ లక్ష్యంగా నిర్ణయించుకున్నారు. పర్యావరణ, రైతు హితాన్ని కాంక్షిస్తూ చేపట్టిన ఈ కార్యక్రమానికి సినీ, రాజకీయ, క్రీడా రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు మద్దతు తెలుపుతున్నారు. తెలుగు రాష్ర్టాల్లో ఈ ఉద్యమంపై అవగాహన కల్పించేందుకు గేయ రచయిత అనంత్‌శ్రీరామ్‌, గాయని స్మిత ‘కావేరి పిలుపు’ పేరుతో ఓ పాటను రూపొందించారు. ఈ గీతాన్ని మంగళవారం హైదరాబాద్‌లో ఆవిష్కరించారు. అనంత్‌శ్రీరామ్‌ మాట్లాడుతూ ‘కావేరి నదిని జీవనవాహినిగా చేయాలనే సంకల్పంతో జగ్గీ వాసుదేవ్‌గారు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ ఉద్యమ సంకల్పం నెరవేరితే మన గోదావరి, కృష్ణ నదులను కూడా కాపాడుకోవడానికి ఓ అడుగుముందుకు వేసిన వాళ్లమవుతాం’ అన్నారు. ‘ఈ పాటకు అనంత్‌శ్రీరామ్‌ అద్భుతమైన సాహిత్యాన్ని అందించారు. ప్రజాక్షేమం కోరే మంచి కార్యక్రమంలో భాగం కావడం ఆనందంగా ఉంది. దీనికి హైదరాబాద్‌ ఇషా ఫౌండేషన్‌ వారు చక్కటి సహకారం అందించారు’ అని స్మిత చెప్పింది.

394

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles