తల్లి ఔన్నత్యాన్ని తెలియజేస్తూ..

Sun,November 17, 2019 12:04 AM

ఆమని ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం అమ్మ దీవెన. శివ ఏటూరి దర్శకుడు. చినమారయ్య, గురవయ్య నిర్మాతలు. ఆమని జన్మదినం సందర్భంగా ఈ చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను శనివారం బొంతు శ్రీదేవి యాదవ్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తల్లి దీవెనలు ఉంటే మనమెప్పుడు చల్లగా ఉంటాం. ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నా అన్నారు. ఆమని మాట్లాడుతూ ఓ తల్లికి ఎంత బాధ్యత ఉంటుంది? ఒక తాగుబోతు మొగుడితో ఆమె ఎలాంటి ఇబ్బందుల్ని ఎదుర్కొంది? అనే అంశాల్ని ఈ సినిమాలో చర్చించారు. ప్రతి సన్నివేశం సహజంగా సాగుతుంది అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ తల్లి ఔన్నత్యాన్ని తెలియజెప్పే చిత్రమిది. ఈ నెలాఖరులో ఆడియోను విడుదల చేస్తాం అన్నారు.

602

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles