ఫోరెన్సిక్ థ్రిల్లర్ కథాంశంతో..


Mon,August 12, 2019 12:12 AM

Amala Paul New Movie Opening Tammareddy Bharadwaja Adith Arun

అమలాపాల్ కథానాయికగా తెలుగు, తమిళ భాషల్లో రూపొందిస్తున్న తాజా చిత్రం శనివారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. అరుణ్‌అదిత్ హీరోగా నటిస్తున్నారు. అనూప్ పనికర్ దర్శకుడు. జె. ఫణీంద్రకుమార్, ప్రభు వెంకటాచలం నిర్మాతలు. తమ్మారెడ్డి భరద్వాజ సమర్పకుడు. ముహూర్తపు సన్నివేశానికి తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ పి.రామ్మోహన్‌రావు క్లాప్‌నివ్వగా, దర్శకుడు రమేష్‌వర్మ కెమెరా స్విఛాన్ చేశారు. తమ్మారెడ్డి భరద్వాజ చిత్ర విశేషాలు తెలియజేస్తూ ఫోరెన్సిక్ థ్రిల్లర్ చిత్రమిది. ఫోరెన్సిక్ పరీక్షలు అంటే ఏమిటో ఈ సినిమాలో చూపించబోతున్నాం. అమలాపాల్ మరోమారు వైవిధ్యభరితమైన పాత్రలో కనిపించనుంది అన్నారు.

ఈ సినిమాతో తొలిసారి నిర్మాణరంగంలోకి అడుగుపెడుతున్నాను. తమిళ సినిమాను అజయ్ పనికర్‌తో కలిసి నిర్మిస్తున్నా. తమిళంలో కడావర్ అనే టైటిల్‌ను పెట్టాం. చెన్నైలో జరిగిన కొన్ని యథార్థ సంఘటనలను ఆధారంగా చేసుకొని ఈ కథ తయారుచేశారు. ఇందులో నేను ఫోరెన్సిక్ డాక్టర్ పాత్రలో కనిపిస్తా అని చెప్పింది. నవ్యతతో కూడుకున్న కథ ఇదని..తమిళ, తెలుగు భాషల్లో ఏకకాలంలో రూపొందించబోతున్నామని దర్శకుడు తెలిపారు. రిత్విక, హరీష్ ఉత్తమన్, రవిప్రకాష్, వినోద్‌సాగర్, అతుల్య రవి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కథ: అభిలాష్, సినిమాటోగ్రఫీ: అరవింద్ సింగ్, సంగీతం: రోనీ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: అనూప్ పనికర్.

238

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles