విడాకులు తీసుకున్న మంచు మనోజ్

Fri,October 18, 2019 12:34 AM

యువహీరో మంచు మనోజ్ తన భార్య ప్రణతి నుంచి విడాకులు తీసుకున్నారు. వైవాహిక బంధంలో ఏర్పడిన మనస్పర్థల కారణంగా ఈ నిర్ణయాన్ని తీసుకోవాల్సి వచ్చిందని మీడియాకు పంపించిన ఓ ప్రకటనలో వెల్లడించారు. ప్రణతితో తాను అందమైన జీవితాన్ని గడిపానని, తమ మధ్య ఎన్నో మధురజ్ఞాపకాలున్నాయని గుర్తుచేసుకున్నారు. స్వతంత్ర భావాలు కలిగిన వ్యక్తులుగా తామిద్దరం పరస్పరం గౌరవ భావంతో వివాహ బంధాన్ని గడిపామన్నారు. అయితే అభిప్రాయభేదాల కారణంగా తామిద్దరం ఎంతో సంఘర్షణకులోనయ్యామని, చివరకు విడిపోవాలని నిర్ణయించుకున్నామని చెప్పారు. సంక్షుభిత పరిస్థితుల్లో కుటుంబం, స్నేహితులు ఎంతో అండగా నిలిచి మనోైస్థెర్యాన్ని కలిగించారన్నారు. సినిమాయే తన ప్రపంచమని, తిరిగి నటుడిగా సత్తా చాటడానికి సిద్ధమవుతున్నానని మనోజ్ పేర్కొన్నారు.


783

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles