మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ 22 మొదలైంది


Tue,July 23, 2019 01:42 AM

Action thriller 22 movie launched by victory Venkatesh

రూపేష్‌కుమార్ చౌదరి, సలోనిమిశ్రా జంటగా నటిస్తున్న 22 చిత్రం సోమవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఈ సినిమా ద్వారా శివకుమార్ బి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. మాఆయి ప్రొడక్షన్స్ పతాకంపై సుశీలాదేవి నిర్మిస్తున్నారు. నాయకానాయికలపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి సీనియర్ హీరో వెంకటేష్ క్లాప్‌నివ్వగా, బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్, నవీన్ ఎర్నేని, కొండా కృష్ణంరాజు కెమెరా స్విఛాన్ చేశారు. తొలి సన్నివేశానికి భీమనేని శ్రీనివాసరావు గౌరవ దర్శకత్వం వహించారు. హరీష్‌శంకర్ స్క్రిప్ట్ అందించారు. దర్శకుడు చిత్ర విశేషాలు తెలియజేస్తూ నేను వినాయక్, పూరి జగన్నాథ్, మారుతి వద్ద దర్శకత్వ శాఖలో పనిచేశాను. వారి స్ఫూర్తితోనే దర్శకుడిగా మారాను. ఈ సినిమా టైటిల్ వెనక ఓ ఆసక్తికరమైన ట్విస్ట్ ఉంటుంది. అదెంటో సినిమా చూస్తేనే అర్థమవుతుంది. మర్డర్ మిస్టరీ నేపథ్యంలో సాగే యాక్షన్ ఎంటర్‌టైనర్ ఇది.

ఈ సినిమాకు ప్రతిభావంతులైన సాంకేతిక బృందం కుదిరింది. ఈ నెల 29 నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం అన్నారు. వినూత్నమైన కథ ఇది. ఈ సినిమా కోసం డ్యాన్స్, ఫైట్స్‌లో శిక్షణ తీసుకున్నా అని హీరో రూపేష్‌కుమార్ చౌదరి చెప్పారు. ప్రొడక్షన్ హెడ్ ఆనీలామా మాట్లాడుతూ దర్శకుడు శివ, నేను కలిసి పూరిజగన్నాథ్ సినిమాలకు పనిచేశాం. శివ ఓ విభిన్నమైన కథతో ఈ సినిమాను రూపొందించబోతున్నాడు అన్నారు. ఈ సినిమాలో తనకు అభినయప్రధానమైన మంచి పాత్ర దొరికిందని పూజా రామచంద్రన్ చెప్పింది. విక్రమ్‌జీత్, జయప్రకాష్, పూజ రామచంద్రన్, రాజేశ్వరి నాయర్, రవివర్మ, ఫిదా శరణ్య, రాంబాబువర్మ, మాస్టర్ తరుణ్ పవార్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: బి.వి.రవికిరణ్, సంగీతం: సాయికార్తీక్, ఎడిటింగ్: శ్యామ్ వాడవల్లి, ఆర్ట్: అడ్డాల రాజు, యాక్షన్: స్టంట్ జాషువా, ప్రొడక్షన్ హెడ్ మరియు కొరియోగ్రఫీ: ఆనీలామా, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శివకుమార్ బి.

310

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles