యంగ్ లుక్ కోసం..!


Wed,August 7, 2019 12:03 AM

Aamir Khan to lose 20 kilos for Lal Singh Chaddha Steal his weight-loss diet

బాలీవుడ్ మిస్టర్‌పర్‌ఫెక్ట్ అమీర్‌ఖాన్ తాను పోషించే పాత్ర కోసం ఏం చేయడానికైనా సిద్ధపడుతుంటారన్న విషయం తెలిసిందే. థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ పరాజయం తరువాత కొంత విరామం తీసుకున్న ఆయన తాజాగా లాల్‌సింగ్ చద్ధా చిత్రంలో నటిస్తున్నారు. 1994లో యాక్షన్ హీరో టామ్ హంక్స్ నటించిన హాలీవుడ్ చిత్రం ఫారెస్ట్ గంప్ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. చారిత్రక ఘటనలకు సాక్షిగా నిలిచిన ఓ వ్యక్తి ఇతివృత్తంతో రూపొందనున్న ఈ చిత్రంలో అమీర్‌ఖాన్ యంగ్‌గా కనిపించనున్నారట. ఇందు కోసం ఆయన దాదాపు 20 కిలోల బరువు తగ్గారని తెలిసింది. ప్రత్యేక డైట్‌ని ఫాలో అవుతున్న ఆయన లాల్‌సింగ్ చద్దా పాత్ర కోసం చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారట. ఈ చిత్రానికి సంబంధించి ప్రతి విషయంలోనూ అమీర్ మార్పులు చేర్పులు సూచిస్తూ ఎక్కడా ఎలాంటి చిన్న చిన్న పొరపాట్లు కూడా దొర్లకుండా సూచనలిస్తున్నారని తెలిసింది. ప్రీప్రొడక్షన్ వర్క్ చివరి దశకు చేరుకున్న ఈ చిత్రాన్ని సెప్టెంబర్ నుంచి ప్రారంభించనున్నట్టు చిత్ర వర్గాల సమాచారం. సీక్రెట్ సూపర్‌స్టార్ ఫేమ్ అద్వైత్ చందన్ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రాన్ని వయాకమ్ 18 పిక్చర్స్‌తో కలిసి అమీర్‌ఖాన్ ప్రొడక్షన్స్ నిర్మించనుంది.

398

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles