చిరంజీవి నాకు స్ఫూర్తి

Sun,December 1, 2019 11:48 PM

‘మద్యం తాగకపోతే జీవించలేని ఓ యువకుడికి, మందు వాసన పడని ఓ యువతికి మధ్య జరిగే ప్రేమకథ ఇది. కథాంశంలోని వైవిధ్యత నచ్చి ఈ సినిమా చేశాను’ అని అన్నారు కార్తికేయ. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం ‘90ఎం.ఎల్’. శేఖర్‌డ్డి ఎర్ర దర్శకత్వం వహించారు. కార్తికేయ క్రియేటివ్ వర్క్ పతాకంపై అశోక్‌డ్డి గుమ్మకొండ నిర్మించారు. నేహాసోలంకి కథానాయిక. ఈ నెల 5న విడుదలకానుంది. ఈ చిత్ర ప్రీరిలీజ్ వేడుక శనివారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన దర్శకుడు అజయ్‌భూపతి బిగ్‌సీడీని విడుదలచేశారు. కార్తికేయ మాట్లాడుతూ ‘చిరంజీవి స్ఫూర్తితో హీరోగా మారాను. ఆయనతో పాటు మహేష్‌బాబు నా దృష్టిలో నిజమైన హీరోలు. ప్రేక్షకుల్ని అలరించడానికి ఎలాంటి పాత్రనైనా చేయడానికి సిద్ధమే.


నటుడిగా పరిణితి కనబరచడానికి ఇప్పటివరకు నేను పనిచేసిన దర్శకులే కారణం. ‘ఆర్‌ఎక్స్100’ సమయంలో శేఖర్‌డ్డి ఈ కథ వినిపించారు. మంచి సినిమా అవుతుందనే నమ్మకంతోనే సొంత సంస్థలో నిర్మించాం. ఈ సినిమా మా సంస్థకు మూడింతల లాభాల్ని తెచ్చిపెడుతుందనే నమ్మకముంది. మద్యపానాన్ని ప్రోత్సహించే సినిమా కాదిది. ఆద్యంతం నవ్విస్తూ ఆరోగ్యకరమైన కిక్‌నిస్తుంది’ అని అన్నారు. ‘ఈ సినిమా ప్రయాణంలో ఎన్ని అవాంతరాలు ఎదురైనా హీరో కార్తికేయ నాకు అండగా నిలిచారు. నటుడిగా అతడిని కొత్త పంథాలో ఆవిష్కరించే సినిమా ఇది’ అని దర్శకుడు చెప్పారు. మంచి సినిమాలో భాగమవ్వడం ఆనందంగా ఉందని కథానాయిక నేహాసోలంకి చెప్పింది. కార్తికేయతో మరో సినిమా చేస్తానని అజయ్‌భూపతి అన్నారు. ఈ కార్యక్షికమంలో సందీప్‌కిషన్, అనూప్‌రూబెన్స్, రాహుల్ సింప్లిగంజ్ తదితరులు పాల్గొన్నారు.

665

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles