యమహా బీఎస్-6 టూవీలర్లు

Sat,November 9, 2019 11:50 PM

- ధరల శ్రేణి రూ.99,200-1.02 లక్షలు
చెన్నై, నవంబర్ 9: జపాన్‌కు చెందిన ద్విచక్ర వాహన తయారీ దిగ్గజం యమహా.. భారతీయ మార్కెట్‌లోకి బీఎస్-6 శ్రేణి టూవీలర్లను విడుదల చేసింది. ఎఫ్‌జెడ్ సిరీస్‌లో వీటిని పరిచయం చేయగా, రెండు మోడళ్లను అందుబాటులోకి తెచ్చింది. ఢిల్లీ ఎక్స్‌షోరూం ప్రకారం ఎఫ్‌జెడ్-ఎఫ్‌ఐ ధర రూ.99,200 లుగా ఉన్నది. ఇక ఎఫ్‌జెడ్‌ఎస్-ఎఫ్‌ఐ ధరల విషయానికొస్తే.. ఈ వేరియంట్‌లో రెండు రకాల బైక్‌లను ప్రవేశపెట్టింది. డార్క్‌నైట్ ధర రూ.1.02 లక్షలుగా ఉంటే, మెటాలిక్ రెడ్ ధర రూ.1.01 లక్షలుగా ఉందని సంస్థ వెల్లడించింది. రాబోయే నెలల్లో బీఎస్-6 ప్రమాణాలతో మరిన్ని బైక్‌లను తీసుకొస్తామని ఈ సందర్భంగా యమహా స్పష్టం చేసింది. ఈ ఏడాది జనవరిలో ఎఫ్‌జెడ్-ఎఫ్‌ఐ, ఎఫ్‌జెడ్‌ఎస్-ఎఫ్‌ఐ ఏబీఎస్ వేరియంట్లను యమహా ఇండియా మార్కెట్‌కు పరిచయం చేసిన విషయం తెలిసిందే. వీటిలో ఇప్పుడు బీఎస్-6 శ్రేణి వాహనాలను ఆవిష్కరించింది. ప్రస్తుతం యమహా ఏబీఎస్ టెక్నాలజీతో వైజెడ్‌ఎఫ్-ఆర్3, వైజెడ్‌ఎఫ్-ఆర్15, ఎంటీ-15 వాహనాలను విక్రయిస్తుండగా, ఎఫ్‌జెడ్25, ఫేజర్, స్కూటర్, సిగ్నస్ రే జెడ్‌ఆర్, ఫాసినో తదితర వాహనాలను అమ్ముతున్నది. వాతావరణంలో కర్బన ఉద్గారాలు ప్రమాదకర స్థాయికి చేరిన నేపథ్యంలో వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి బీఎస్6 ప్రమాణాలను కేంద్రం తప్పనిసరి చేస్తున్న విషయం తెలిసిందే.

279
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles