నాట్కో ప్లాంట్‌పై అమెరికా అభ్యంతరాలు

Tue,August 13, 2019 12:47 AM

USFDA issues 6 observations to Natco Pharmas API facility

హైదరాబాద్, ఆగస్టు 12: ప్రముఖ ఔషధ సంస్థ నాట్కో ఫార్మాకు చెందిన మేకగూడ గ్రామంలో ఉన్న తయారీ కేంద్రంపై అమెరికా నియంత్రణ మండలి ఆరు అభ్యంతరాలను వ్యక్తం చేసింది. ఇందుకు సంబంధించి ఫామ్ 483ని జారీ చేసింది. ఈ నెల 5 నుంచి 9 మధ్యకాలంలో తనిఖీ చేసిన యూఎస్‌ఎఫ్‌డీఏ ఉన్నతాధికారులు ఈ ఆరు అభ్యంతరాలను వ్యక్తంచేసినట్లు సంస్థ బీఎస్‌ఈకి సమాచారం అందించింది. డాటా ఇంటెగ్రిటీతోపాటు ఇతర విషయాలపై యూఎస్‌ఎఫ్‌డీఏ అభ్యంతరాలను త్వరలో పరిష్కరించనున్నట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి.

237
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles