ఎండీహెచ్ సాంబార్‌లో బ్యాక్టీరియా

Thu,September 12, 2019 03:55 AM

US wont buy asli masale sach sach FDA finds bacteria in MDH Sambhar Masala

- గుర్తించిన యూఎస్‌ఎఫ్‌డీఏ


న్యూఢిల్లీ, సెప్టెంబర్ 11: ఎండీహెచ్ సాంబార్ మసాలాలో హానికర సూక్ష్మజీవులు ఉన్నట్లు అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ మండలి (యూఎస్‌ఎఫ్‌డీఏ) గుర్తించింది. 100 గ్రాముల బాక్స్‌ల్లోని సాంబార్ మసాలాలను యూఎస్‌ఎఫ్‌డీఏ అధికారులు పరీక్షించడంతో సాల్మోనెల్లా అనే బ్యాక్టీరియా ఉన్నట్లు తేలింది. ఈ మసాలాలను తిన్న 12 నుంచి 72 గంటల్లో అతిసారం, వాంతులు, విరేచనాలు, తిమ్మిర్లు, జ్వరం సంభవిస్తాయని అధికారులు చెబుతున్నారు. కాగా, షార్జాలోని ఆర్-పురె అగ్రో స్పెషాలిటీస్ ఈ సాంబార్ మసాలాను తయారు చేసినట్లు చెబుతున్న యూఎస్‌ఎఫ్‌డీఏ.. ఇవి హౌజ్ ఆఫ్ స్పైసెస్ (ఇండియా) ద్వారా ఉత్తర కాలిఫోర్నియా రిటైల్ స్టోర్లకు వచ్చాయని స్పష్టం చేసింది.

మార్కెట్ల నుంచి వెనక్కి..

ప్రమాదకర బ్యాక్టీరియా ఉన్న సాంబార్ మసాలా ఉత్పత్తులను మార్కెట్ నుంచి వెనక్కి తీసుకుంటున్నామని హౌజ్ ఆఫ్ స్పైసెస్ (ఇండియా) ప్రకటించింది. 107, 48, 47 కోడ్స్ ఉన్న లాట్లను రిటైల్ స్టోర్ల నుంచి ఉపసంహరిస్తున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది. ఇదిలావుంటే ఈ ఉత్పత్తులు భారతీయ మార్కెట్‌లోకీ వచ్చాయా? అన్నదానిపై స్పష్టత లేకుండా ఉన్నది. కాగా, ఎండీహెచ్ ఉత్పత్తుల్లో ఈ రకమైన బ్యాక్టీరియాను యూఎస్‌ఎఫ్‌డీఏ గుర్తించడం కొత్తేమీ కాదు.

311
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles