హువావీతో వ్యాపారం చేయం

Sun,August 11, 2019 01:03 AM

Trump Says We are Not Doing Business With Huawei

-అమెరికా అధ్యక్షుడు ట్రంప్
-దేశ భద్రతకు ముప్పే కారణం

వాషింగ్టన్, ఆగస్టు 10: చైనా టెక్నాలజీ దిగ్గజం హువావీతో అమెరికా ఎలాంటి వ్యాపార లావాదేవీలను పెట్టుకోబోదని ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. హువావీ 5జీ సేవలను దేశంలోకి అనుమతిస్తే జాతీయ భద్రతకు ముప్పు వాటిల్లుతుందన్న ఆందోళనను శనివారం వైట్‌హౌజ్‌లో విలేఖరులతో మాట్లాడుతూ వ్యక్తం చేశారు. అందుకే హువావీని దూరంగా ఉంచుతామని తేల్చిచెప్పారు. మరికొన్ని చైనా సంస్థలపైనా ఈ నెల 13 నుంచి వ్యాపార క్రయవిక్రయ లావాదేవీల నిషేధం అమల్లోకి రానుంది. ఇదిలావుంటే అమెరికా వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోళ్లను చైనా అధికారికంగా నిషేధించిన విషయం తెలిసిందే. చైనా నిర్ణయం అమెరికా వ్యవసాయ ఆధారిత కంపెనీల అమ్మకాలను ప్రభావితం చేస్తుండగా, రైతుల పంట కొనుగోళ్లకూ దెబ్బే. ఈ క్రమంలో హువావీపై ఇన్నాళ్లు నాన్చుతున్న నిర్ణయాన్ని ట్రంప్ ప్రకటిం చేశారు. దీంతో వాణిజ్య యుద్ధం తీవ్ర రూపం దాల్చినట్టయింది.

277
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles