12 వేలు దాటిన నిఫ్టీ

Fri,November 8, 2019 12:20 AM

-కొనసాగుతున్న మార్కెట్ల ర్యాలీ
ముంబై, నవంబర్ 7: స్టాక్ మార్కెట్ల దూకుడు కొనసాగుతున్నది. రోజుకొక చారిత్రక గరిష్ఠ స్థాయికి చేరుకుంటున్న దేశీయ మార్కెట్లు గురువారం మరో ఉన్నత శిఖరాలకు చేరుకున్నాయి. తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సంస్కరణలు, అమెరికా-చైనా దేశాల మధ్య జరుగుతున్న వాణిజ్య చర్చలు పురోగతి దిశగా ఉండటంతో జాతీయ స్టాక్ ఎక్సేంజ్ సూచీ నిఫ్టీ ఐదు నెలల తర్వాత 12 వేల మార్క్‌ను దాటింది. ఇంట్రాడేలో 40,688.27 పాయింట్ల ఆల్‌టైం గరిష్ఠ స్థాయిని తాకిన సూచీలు చివరకు 183.96 పాయింట్ల లాభంతో 40,653.74 వద్ద ముగిసింది.


మెటల్, ఇంధనం, బ్యాంకింగ్ రంగ సూచీల నుంచి వచ్చిన మద్దతుతో దలల్‌స్ట్రీట్ కాంతులతో నిండిపోయింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 46పాయింట్లు అధికమై 12,012 వద్ద ముగిసింది. ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించడంతో సన్‌ఫార్మా షేరు 3.02 శాతం లాభపడి టాప్ గెయినర్‌గా నిలిచింది. వీటితోపాటు ఇండస్‌ఇండ్ బ్యాంక్, ఆర్‌ఐఎల్, ఐటీసీ, వేదాంతా, ఏషియన్ పెయింట్స్, హెచ్‌డీఎఫ్‌సీ, ఇన్ఫోసిస్‌లు మూడు శాతం వరకు లాభపడ్డాయి. మరోవైపు యెస్ బ్యాంక్, హెచ్‌యూఎల్, ఓఎన్‌జీసీ, టాటా మోటర్స్, యాక్సిస్ బ్యాంక్, ఎల్‌అండ్‌టీ, ఎన్‌టీపీసీలు మూడు శాతానికి పైగా నష్టపోయాయి. రంగాలవారీగా చూస్తే ఇంధనం, మెట ల్, రియల్టీ, కన్జ్యూమర్ డ్యూరబుల్, టెలికం విభాగ షేర్లు స్వల్ప లాభాల్లో ముగియగా, ఆయిల్ అండ్ గ్యాస్, క్యాపిటల్ గూడ్స్, యుటిలిటీ, వాహన రంగ షేర్లు మదుపరులను ఆకట్టుకోలేకపోయాయి.

మెరిసిన రియల్టీ షేర్లు

రియల్టీ రంగాన్ని ఊతమివ్వడానికి కేంద్ర ప్రభుత్వం రూ.25 వేల కోట్ల ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించడంతో ఈ రంగ షేర్లు అధికంగా లాభపడ్డాయి. ఎన్‌బీసీసీ అత్యధికంగా 8.20 శాతం ఎగబాకగా, ఇండియాబుల్స్ 4.94 శాతం, శోభ 2.34 శాతం, ప్రిస్టేజ్ ఎస్టేట్ 1.48 శాతం అధికమయ్యాయి.

199
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles