ఆగని పసిడి పరుగు

Tue,July 23, 2019 03:06 AM

Today 22 Carat Gold Price Per Gram in India INR


-రికార్డు స్థాయికి చేరిన బంగారం ధర
-తులం రూ.35,970

న్యూఢిల్లీ, జూలై 22: పసిడి ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. దేశీయ ఆభరణాల వర్తకుల కొనుగోళ్లకు మొగ్గుచూపడంతో దేశరాజధాని ఢిల్లీలో 99.9 శాతం స్వచ్ఛత కలిగిన బంగారం ధర మరో రూ.100 అందుకొని చారిత్రక గరిష్ఠ స్థాయి రూ.35,970కి చేరింది. గత శుక్రవారం రూ.35,950 పలికిన ధర ఆ మరుసటి రోజు స్వల్పంగా తగ్గింది. పసిడితో వెండి కిలో ధర రూ.260 ఆగని పసిడి పరుగు రికార్డు స్థాయికి చేరిన బంగారం ధర n తులం రూ.35,970పెరిగి రూ.41,960కి చేరుకున్నట్లు ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ ఒక ప్రకటనలో వెల్లడించింది. పారిశ్రామికవర్గాలు, నాణేల తయారీదారుల నుంచి లభించిన మద్దతుతో గడిచిన వారం రోజులుగా వెండి మరింత బలపడిందని, పసిడి రికార్డు స్థాయికి చేరుకున్నట్లు ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ సురేంద్ర జైన్ తెలిపారు. ఈక్విటీ మార్కెట్లు పతనమవడంతో పెట్టుబడిదారులు తమ ఇన్వెస్ట్‌మెంట్లను అతి విలువైన లోహాలవైపు మళ్లించడంతో వీటి ధరలు ఒక్కసారిగా పుంజుకుంటున్నాయని ఆయన చెప్పారు. అంతర్జాతీయ మార్కెట్లో అతి విలువైన లోహాల ధరలు యథాతథంగా ఉన్నప్పటికీ దేశీయంగా ధరలు పెరుగడం విశేషమన్నారు. న్యూయార్క్ బులియన్ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర 1,425.60 డాలర్ల వద్ద ఉండగా, వెండి 16.40 డాలర్ల వద్ద ఉన్నది.

680
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles