విషంపెట్టి చంపాలనుకొని అడ్డంగా దొరికాడు

Sat,November 9, 2019 12:45 AM

-వివాహేతర సంబంధం వద్దన్నందుకు ఘాతుకం
పెన్‌పహాడ్ : వివాహేతర సంబంధం వద్దన్నదని ఓ మహిళను చంపాలని పథకం పన్నిన వ్యక్తి అడ్డంగా దొరికిపోయాడు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్‌లో శుక్రవారం వెలుగులోకి వచ్చింది. పెన్‌పహాడ్ మండల కేంద్రానికి చెందిన ఒగ్గు వెంకన్న పంక్చర్ దుకాణం నిర్వహిస్తున్నాడు. ఇదే మండలంలోని కేవ్లాతండాకు చెందిన ఓ మహిళ భర్త చనిపోవడంతో తల్లి వద్ద ఉంటున్నది. ఈ క్రమంలో ఒగ్గు వెంకన్నతో ఏర్పడిన పరిచయం సహజీవనానికి దారి తీసింది. తాను చేస్తున్నది తప్పని గుర్తించిన మహిళ తనను కలువొద్దంటూ నెల రోజులుగా అతనికి దూరంగా ఉంటున్నది. వివాహేతర బంధాన్ని వద్దన్నందుకు సదరు మహిళను చంపేందుకు వెంకన్న పన్నాగం పన్నాడు. ఈ నెల 4న మహిళ తన తల్లి, కుటుంబ సభ్యులతో కలిసి పత్తి ఏరడానికి వెళ్లగా ఆమె తీసుకెళ్లిన భోజనంలో వెంకన్న పశువులకు ఇచ్చే మత్తు మందును కలిపాడు. విషయం గమనించిన వెంకన్న మిత్రుడు రవి బాధితురాలికి ఫోన్‌లో సమాచారం ఇచ్చాడు. అప్రమత్తమైన మహిళ వెంటనే టిఫిన్ బాక్సుతో పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదుతో ఎస్సై రంజిత్‌రెడ్డి కేసు నమోదు చేశారు. శుక్రవారం నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

68
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles