ఓబీసీ లాభం రూ.113 కోట్లు

Tue,July 23, 2019 02:27 AM

OBC posts profit for 4th straight qtr on fall in NPA high t

ప్రభుత్వరంగ సంస్థ ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్(ఓబీసీ) ఎట్టకేలకు లాభాల బాటపట్టింది. జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికానికిగాను బ్యాంక్ రూ.112.68 కోట్ల లాభాన్ని గడించింది. అంతక్రితం ఏడాది ఇదేకాలానికి బ్యాంక్ రూ.393.21 కోట్ల నష్టాన్ని చవిచూసింది. మార్చి త్రైమాసికంలో నమోదైన రూ.201.50 కోట్ల లాభంతో పోలిస్తే మాత్రం తగ్గుముఖం పట్టింది. ఏప్రిల్-జూన్ మధ్యకాలానికి బ్యాంక్ ఆదాయం రూ.4,729.58 కోట్ల నుంచి రూ.5,634.98 కోట్లకు పెరిగినట్లు బీఎస్‌ఈకి సమాచారం అందించింది. జూన్ 2018 చివరినాటికి 17.89 శాతంగా ఉన్న బ్యాంక్ స్థూల నిరర్థక ఆస్తుల విలువ గత త్రైమాసికానికి 12.56 శాతానికి తగ్గగా, నికర ఎన్‌పీఏ 10.63 శాతం నుంచి 5.91 శాతానికి తగ్గాయి.

167
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles