జెట్‌పై ఆసక్తి లేదు: అనిల్ అగర్వాల్

Mon,August 12, 2019 11:57 PM

No longer interested in Jet Airways says Anil Agarwal

ముంబై, ఆగస్టు 12: నిధులు లేక మూతపడిన జెట్ ఎయిర్‌వేస్ కొనుగోలు చేయడానికి గతంలో ముందుకొచ్చిన ఒక్కోక్కరు జారుకుంటున్నారు. గతంలో జెట్ ఎయిర్‌వేస్‌ను కొనుగోలు చేయడానికి బిడ్డింగ్‌ను దాఖలు చేసిన ప్రముఖ మైనింగ్ దిగ్గజం అధినేత అనిల్ అగర్వాల్..తాజాగా సోమవారం ఈ బిడ్డింగ్ ప్రక్రియ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఎతిహాద్ ఎయిర్‌వేస్, హిందుజా గ్రూప్‌లూ జెట్ కొనుగోలుకు మొదట్లో ఆసక్తి చూపినా.. ఆ తర్వాత వెనుకకు తగ్గాయి. తొలి విడుత నిర్వహించిన బిడ్డింగ్ ప్రక్రియ చివరి తేదీని ఈ నెల 3 నుంచి 10 వరకు పెంచినప్పటికీ ఏ సంస్థ కూడా ముందుకురాలేదు. జెట్ ఎయిర్‌వేస్‌లో 24 శాతం వాటా కలిగిన ఎతిహాద్ కూడా రెండో రౌండ్‌లో పాల్గొంటుందని అందరు ఆశించారు, కానీ చివరి నిమిషంలో వెనక్కి తగ్గింది.

176
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles