మ్యాక్స్‌క్యూర్ ఇక మెడికవర్ హాస్పిటల్స్

Sun,August 11, 2019 01:08 AM

MaxCure Hospitals is now Medicover Hospitals

హైదరాబాద్, ఆగస్టు 10: మ్యాక్స్‌క్యూర్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్.. మెడికవర్ హాస్పిటల్స్‌గా మారాయి. ఐరోపాకు చెందిన మెడికవర్.. దేశీయ హెల్త్‌కేర్ రంగంలోకి మ్యాక్స్‌క్యూర్‌లో పెట్టుబడుల ద్వారా ప్రవేశించింది. ఈ క్రమంలోనే మ్యాక్స్‌క్యూర్ హాస్పిటల్స్.. మెడికవర్ హాస్పిటల్స్‌గా రూపాంతరం చెందాయి. తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రల్లో 11 మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్‌ను మ్యాక్స్‌క్యూర్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. హైదరాబాద్‌లో మూడుండగా, నిజామాబాద్, కరీంనగర్‌లలో ఒక్కోటి చొప్పున ఉన్నాయి. 2011లో డాక్టర్ అనిల్ కృష్ణ మ్యాక్స్‌క్యూర్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్‌ను ప్రారంభించారు. కాగా, మ్యాక్స్‌క్యూర్ పెట్టుబడులపట్ల మెడికవర్ చైర్మన్ ఫెడ్రిక్ స్టెన్మో ఆనందం వ్యక్తం చేశారు. ఇప్పటికే తమకు ఢిల్లీలో ఫర్టిలిటీ క్లీనిక్స్ ఉన్నదని, అయితే తాజా పెట్టుబడుల ద్వారానే భారతీయ హెల్త్‌కేర్ రంగంలోకి తాము పూర్తిస్థాయిలో ప్రవేశించినైట్లెందని ఓ ప్రకటనలో ఆయన తెలిపారు. 1995లో మెడికవర్‌ను ప్రారంభించగా, స్వీడన్‌కు చెందిన ఈ హాస్పిటల్.. ఆ తర్వాత పోలాండ్, ఉక్రెయిన్, రొమానియా, జర్మనీ తదితర దేశాలకు విస్తరించింది.

215
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles