ఆకట్టుకున్న కొటక్ మహీంద్రా బ్యాంక్

Tue,July 23, 2019 02:47 AM

Kotak Mahindra Bank likely to post robust profit growth in Q1 asset quality to be stable

క్యూ1లో 23 శాతం పెరిగిన లాభం
న్యూఢిల్లీ, జూలై 22: దేశంలో అతిపెద్ద ప్రైవేట్ రంగ ఆర్థిక సేవల సంస్థల్లో ఒకటైన కొటక్ మహీంద్రా బ్యాంక్ ఆశాజనక ఆర్థిక ఫలితాలను ఇక్కడ ప్రకటించింది. జూన్ 30తో ముగిసిన మూడు నెలలకాలానికిగాను బ్యాం క్ రూ.1,932 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని ఆర్జించింది. 2018-19 ఏడాది ఇదే కాలానికి నమోదైన రూ.1,574 కోట్ల లాభంతో పోలిస్తే 23 శాతం వృద్ధిని కనబరిచినట్లు బ్యాంక్ వర్గాలు వెల్లడించాయి.గత త్రైమాసికంలో బ్యాంక్ ఆదాయం రూ. 9,903.56 కోట్ల నుంచి రూ.12,129.56 కోట్లకు చేరాయి. ఏకీకృత విషయానికి వస్తే రూ.7,944.61 కోట్ల ఆదాయంపై రూ. 1,025 కోట్ల లాభాన్ని గడించింది. ఆస్తుల నాణ్యత పరిమితులను నిర్దేశించుకున్న స్థాయిలోనే నమోదయ్యాయని, తొలి త్రైమాసికంలో బ్యాంక్ స్థూల నిరర్థక ఆస్తుల విలువ 2.17 శాతం నుంచి 2.19 శాతానికి పెరుగగా, నికర ఎన్‌పీఏలు మాత్రం 0.86 శాతం నుంచి 0.73 శాతానికి తగ్గాయి. మొండి బకాయిలను పూడ్చుకోవడానికి బ్యాంక్ నిధుల కేటాయింపులు రూ.498.98 కోట్ల నుంచి రూ.350.22 కోట్లకు తగ్గినట్లు వెల్లడించింది. ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించినప్పటికీ స్టాక్ మార్కెట్లో బ్యాంక్ షేరు ధర 3.08 శాతం తగ్గి రూ.1,453.65 వద్ద ముగిసింది.

240
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles