జాక్ మా పదవీ విరమణ

Wed,September 11, 2019 02:35 AM

Jack Ma Is Retiring From Alibaba He Wont Go Far

బీజింగ్, సెప్టెంబర్ 10: ప్రపంచ ఈ-కామర్స్ రంగంలో తనదైన ముద్రవేసిన అలీబాబా గ్రూపు వ్యవస్థాపకుడు జాక్ మా అన్నంత పనిచేశారు. 55 ఏండ్లకే పదవీ విరమణ చేస్తానని గతంలో ప్రకటించిన ఆయన..మంగళవారం తన చైర్మన్ పదవి నుంచి వైదొలిగారు. ఈ-కామర్స్ రంగం దశదిశ మార్చిన జాక్ మా.. అనిశ్చిత పరిస్థితులు ఎదుర్కొంటున్న ప్రస్తుత తరుణం, అమెరికా-చైనా దేశాల మధ్య ట్రేడ్‌వార్ జరుగుతున్న ఈ పరిస్థితుల్లో ఆయన వైదొలగడం కంపెనీకి పెద్దదెబ్బ లాంటిదే. చైనా సంపన్నవర్గాల్లో ఒకరైనా మా..ఏడాది క్రితమే పదవీ విరమణ చేయనున్నట్లు ప్రకటించినప్పటికీ, కంపెనీ అవసరాల నిమిత్తం మరో ఏడాది పదవిలో ఉండాలని సంస్థ కోరడటంతో ఆయన తన పదవికాలాన్ని మరో ఏడాది పాటు పెంచుకున్నారు. తన 55వ పుట్టిన రోజున పదవీ విరమణ చేయనున్నట్లు ప్రకటించారు. అయినప్పటికీ, అలీబాబా పార్టనరల్‌షిప్ కూటమిలో సభ్యుడిగా కొనసాగనున్నారు. ఈ భాగస్వామ్య కూటమిలో మాకు అత్యధిక వాటా కలిగివున్నారు. ఇంగ్లీష్ టీచర్ అయిన మా.. చైనా ఉత్పత్తులను అమెరికా ఎగుమతి చేయాలనే ఉద్దేశంతో 1999లో సంస్థను ప్రారంభించారు.

247
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles