తెలంగాణ పౌరసరఫరాలో ఐటీ వినియోగం భేష్

Sat,November 9, 2019 12:48 AM

-అసోం ఐటీశాఖ మంత్రి కేశబ్ మహంత ప్రశంస
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: తెలంగాణ పౌరసరఫరాలో ఐటీ వినియోగం బాగున్నదని అసోం ఐటీశాఖ మంత్రి కేశబ్ మహంత ప్రశంసించారు. శుక్రవారం ఆయన హైదరాబాద్‌లోని పౌరసరాఫరాలశాఖ భవన్‌లో కమిషనర్ పీ సత్యనారాయణరెడ్డి, ఇతర అధికారులతో సమావేశమయ్యారు. అనంతరం కమాండ్ కంట్రోల్ సెంటర్, సరుకుల రవాణా వాహనాల జీపీఎస్ ట్రాకింగ్ విధానం, ఈ పాస్ మిషన్ పనితీరు, ఐరిస్ విధానాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సాంకేతిక పరిజ్ఞానంతో నిత్యావసర సరుకుల అక్రమరవాణాకు అడ్డుకట్ట వేస్తున్న తీరు ఆచరణీయమని కొనియాడారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ పనితీరు అద్భుతంగా ఉన్నదన్నారు. లబ్ధిదారులకు సకాలంలో సరుకులు అందిస్తున్న తెలంగాణ ఐటీ ప్రాజెక్టుల పనితీరు బాగుందని కొనియాడారు.

43
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles