27 నుంచి భారత్‌లో ఐఫోన్11

Thu,September 12, 2019 04:12 AM

IPhone 11 in India starting from 27th in market

- రూ.64,900 నుంచి రూ.1.09 లక్షల మధ్యలో ధర

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 11: దేశీయ ఐఫోన్ మొబైల్ ప్రియులకు శుభవార్త. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న యాపిల్ కంపెనీ నూతన మొబైల్ దేశీయ మార్కెట్లోకి ఈ నెల చివర్లో 27న అందుబాటులోకి రాబోతున్నది. ఐఫోన్ 11, ఐఫోన్ 11 ప్రొ, ఐఫోన్ 11 ప్రొ మ్యాక్స్ పేర్లతో విడుదల చేసిన ఈ మొబైల్ ప్రారంభ ధరను రూ.64,900గా నిర్ణయించింది. అంతర్జాతీయ మార్కెట్లోకి విడుదల చేసిన ఈ మూడు రకాల ఫోన్లు అత్యంత శక్తివంతమైనదని, అడ్వాన్స్ స్మార్ట్‌ఫోన్లని యాపిల్ సీనియర్ వైస్-ప్రెసిడెంట్ (వరల్డ్‌వైడ్ మార్కెటింగ్) ఫిల్ స్కిల్లర్ తెలిపారు. 64జీబీ, 128జీబీ, 256 జీబీ సామర్థ్యం కలిగిన ఐఫోన్ 11 మోడల్ రకం రూ.64,900 నుంచి లభించనున్నది. అలాగే ఐఫోన్ 11 ప్రొ, ఐఫోన్ 11 ప్రొ మ్యాక్స్‌లు కూడా 64జీబీ, 256 జీబీ, 512 జీబీ మెమొరీ కలిగివున్నాయి. ఈ మొబైళ్లు రూ.99,900 నుంచి రూ.1,09,900 మధ్యలో లభించనున్నట్లు కంపెనీ వర్గాల వెల్లడించాయి.

పాత మోడళ్ల ధరలను తగ్గించిన సంస్థ

దేశీయ మార్కెట్లో అంతంత మాత్రం ఆదరణ పొందిన పలు మోడళ్ల ధరలను భారీగా తగ్గించింది సంస్థ. వీటిలో 32 జీబీ సామర్థ్యం కలిగిన ఐఫోన్ 7 కూడా ఉన్నది. ప్రస్తుతం ఈ మోడల్ రూ.29,900కి లభించనున్నది. దేశీయంగా లభిస్తున్న చౌక ధర కలిగిన మోడల్ ఇదే కావడం విశేషం. కంపెనీ వెబ్‌సైట్‌లో ఉన్న సమాచారం మేరకు ఐఫోన్ 8(64జీబీ) మోడల్ ప్రస్తుతం రూ.39,900(గతంలో రూ.59,990), ఐఫోన్ 8 ప్లస్, ఐఫోన్ ఎక్స్‌ఆర్(64జీబీ) మోడల్ రూ.49,900కి తగ్గనున్నది. వీటితోపాటు ఐఫోన్ ఎక్స్‌ఎస్(64జీబీ) మోడల్ రూ.89,900, 256జీబీ రకం రూ. 1,03,600కి దిగిరానున్నాయి. కంపెనీకి భారత మార్కెట చాలా కీలకమని, జూన్ 2019తో ముగిసిన ఏడాదికాలంలో కంపెనీ విక్రయాలు 9.9 శాతం పెరిగి 3.69 కోట్లకు చేరుకున్నాయి.

521
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles