హైదరాబాద్‌లో ఇన్నోలియా సోలార్‌ ప్లాంట్‌

Tue,September 10, 2019 12:22 AM

Innolia Energy announces Rs 225 crore investment in solar module EV products manufacturing

- రూ.225 కోట్లతో ఏర్పాటు చేస్తున్న సంస్థ

న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 9: అమెరికాకు చెందిన ఇన్నోలియా ఎనర్జీ..హైదరాబాద్‌లో సోలార్‌ మాడ్యుల్స్‌, లిథియం బ్యాటరీ, విద్యుత్‌తో నడిచే వాహనాల ఉత్పత్తుల యూనిట్‌ను నెలకొల్పుతున్నట్లు ప్రకటించింది. ఇందుకోసం రూ.225 కోట్ల మేర పెట్టుబడులు పెట్టుబోతున్నట్లు కంపెనీ వ్యవస్థాపకుడు అరవింద్‌ రెడ్డి తెలిపారు. అమెరికాలో అడ్వాన్స్‌ టెక్నాలజీతో యూనిట్‌ను ఏర్పాటు చేసిన సంస్థ.. భారత్‌లో ఏర్పాటు చేయనున్న ఈ యూనిట్‌లో సోలార్‌ ప్యానెళ్లు, లిథియం-బ్యాటరీ, ఎలక్ట్రిక్‌ వాహనాలను ఒకే రూఫ్‌ కింద తయారు చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. పారిశ్రామిక రంగంలో 27 ఏండ్ల అనుభవం కలిగిన అరవింద్‌ రెడ్డి..ఇంటెల్‌/సిర్రస్‌ లాజిక్‌/ఎస్‌ఎస్‌టీ/మైక్రోచిప్‌ పలు అంతర్జాతీయ కంపెనీల్లో విధులు నిర్వహించారు.

401
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles