మనీ లాండరింగ్ అడ్డుకట్టకు ఉన్నతస్థాయి కమిటీ

Tue,October 8, 2019 12:30 AM

-రెవిన్యూ కార్యదర్శి నేతృత్వంలో ఏర్పాటు చేసిన కేంద్రం
న్యూఢిల్లీ, అక్టోబర్ 7: మనీ లాండరింగ్ కార్యాకలాపాల అడ్డుకట్టకు ఓ ఉన్నతస్థాయి కమిటీని సోమవారం కేంద్ర ప్రభుత్వం నియమించింది. 19 మంది సభ్యుల ఈ ఇంటర్-మినిస్టీరియల్ కో-ఆర్డినేషన్ కమిటీకి రెవిన్యూ కార్యదర్శి అజయ్ భూషణ్ పాండే చైర్మన్‌గా వ్యవహరిస్తారు. ఈ ప్యానెల్‌కు ఐదుగురు కార్యదర్శులుండగా, వారిలో ఆర్థిక సేవలు, ఆర్థిక వ్యవహారాలు, కార్పొరేట్ వ్యవహారాలు, విదేశీ వ్యవహారాల శాఖల కార్యదర్శులుంటారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్‌తోపాటు సెబీ, ఐఆర్‌డీఏఐ, సీబీఐసీ, సీబీడీటీ చైర్మన్లు, ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ తదితరులు సభ్యులుగా ఉండనున్నారు. తీవ్రవాదానికి ఆర్థిక సాయం వంటి పలు చట్ట వ్యతిరేక కార్యకలాపాల నియంత్రణకూ ఈ కమిటీ పనిచేయనున్నది.

304
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles