ప్యూర్ప్యూర్‌ ఎలక్ట్రిక్ వాహనాలు

Fri,July 12, 2019 02:18 AM

IIT Hyderabad incubated startup Pure EV raises undisclosed funding

-ఐఐటీ హైదరాబాద్, ఎనర్జీ సంయుక్తంగా తయారీ
-త్వరలో మార్కెట్‌లోకి 4 మోడళ్లు


సంగారెడ్డి రూరల్: ఇక మార్కెట్లోకి సరికొత్త ఎలక్ట్రిక్ వాహనాలు రానున్నాయి. పూర్తిగా బ్యాటరీ ఆధారితంగా నడిచే ఈ ద్విచక్ర వాహనాలు పెట్రోల్ వాహనాలకు ధీటుగా రోడ్లపై దూసుకుపోనున్నాయి. ఈ వాహనాల తయారీకి ప్రతిష్టాత్మక ఐఐటీ హైదరాబాద్ వేదికగా నిలువగా.. ప్యూర్ ఎనర్జీ అంకుర సంస్థ నేతృత్వంలో మరికొన్ని నెలల్లో సరికొత్త ఎలక్ట్రిక్ వాహనాలు మార్కెట్‌లో ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి తేనున్నారు. ఇప్పటికే తయారైన వాహనాల పనితీరును ఐఐటీ క్యాంపస్ ఆవరణలో టెస్ట్ రైడ్‌ల ద్వారా సంస్థ ప్రతినిధులు పరిశీలించారు. తక్కువ ధరకే నాలుగు రకాల మోడళ్లలో ఈ ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగదారులకు అందించనున్నారు. అయితే కొత్తగా ప్యూర్ ఎనర్జీ ఆధ్వర్యంలో తయారవుతున్న ఈ ఎలక్ట్రిక్ వాహనాలపై ప్రముఖ ఫార్మా దిగ్గజం వీసీ నన్నపనేని 32 మిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టారు. ఈ పెట్టుబడి ద్వారా ప్యూర్ ఈవీ సంస్థ విలువ రూ.240 కోట్లకు చేరింది.


2016లో ప్రారంభం

ఐఐటీ హైదరాబాద్‌లో ప్రొఫెసర్ నిషాంత్ డోంగ్రీ ప్యూర్ ఎనర్జీ పేరుతో అంకుర సంస్థను ప్రారంభించారు. లిథియం బ్యాటరీ సహాయంతో వాయు, శబ్ద కాలుష్య రహిత వాహనాల తయారీపై గత మూడేండ్లుగా అనేక పరిశోధనలు చేశారు. ఇవి విజయవంతం కావడంతో ఆ సంస్థ సీఈవో రోహిత్ వదేరా వాహనాలను మార్కెటింగ్ ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించారు.

నాలుగు రకాల మోడళ్లు

2020 నాటికి నాలుగు రకాల మోడళ్లలో 10వేల వాహనాలను మార్కెట్‌లోకి తీసుకురావాలనే లక్ష్యంతో సంస్థ ప్రతినిధులు అడుగులు వేస్తున్నారు. మన రహదారులు ప్రజల అవసరాలను బట్టి కొత్తగా ఎలక్ట్రిక్ స్కూటర్లు, ఎలక్ట్రిక్ సైకిళ్లను తయారు చేస్తున్నట్లు సంస్థ ప్రతినిధులు వివరించారు. ఒక యూనిట్ కరెంటుకే బ్యాటరీ చార్జింగ్ ఫుల్ అవుతుండగా, 120 కిలోమీటర్ల దూరం ప్రయాణించే వీలును కల్పించారు. వాహనదారునికి కిలోమీటర్‌కు కేవలం ఐదు పైసలే ఖర్చవుతున్నది. సేల్స్ పెరిగితే మరిన్ని వాహనాలను మార్కెట్‌లో సిద్దంగా ఉంచాలని సంస్థ భావిస్తున్నది.

564
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles