ఐడీబీఐ బ్యాంక్ నష్టం రూ.3,459 కోట్లు

Sat,November 9, 2019 02:17 AM

న్యూఢిల్లీ, నవంబర్ 8: ప్రైవేట్ రంగ సంస్థ ఐడీబీఐ బ్యాంక్ నష్టాల పరంపర కొనసాగుతున్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికిగాను బ్యాంక్ రూ.3,458.84 కోట్ల నష్టాన్ని చవిచూసింది. క్రితం ఏడాది ఇదే సమయంలోనూ రూ.3,602.49 కోట్లు నష్టపోయింది. జూన్ త్రైమాసికంలో నమోదైన రూ.3,800.84 కోట్ల నష్టంతో పోలిస్తే స్వల్పంగా తగ్గింది. బ్యాంక్ ఆదాయం రూ.6,162.14 కోట్ల నుంచి రూ.6,231.02 కోట్లకు పెరిగినట్లు బీఎస్‌ఈకి సమాచారం అందించింది. గత త్రైమాసికానికి కూడా స్థూల నిరర్థక ఆస్తుల విలువ 29.43 శాతంగా నమోదయ్యాయి. క్రితం ఏడాది ఇది 31.78 శాతంగా ఉన్నది. విలువ పరంగా చూస్తే గ్రాస్ ఎన్‌పీఏ రూ.60,875.49 కోట్ల నుంచి రూ.52,052.78 కోట్లకు తగ్గగా, నికర ఎన్‌పీఏ 5.97 శాతానికి(రూ. 7,918.61 కోట్లు) తగ్గాయి. మొండి బకాయిలను పూడ్చుకోవడానికి రూ.5,481.64 కోట్ల నిధులను వెచ్చించిన బ్యాంక్..ఈసారికిగాను రూ.3,544.93 కోట్లకు తగ్గాయి.

75
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles