కాంట్రాక్టు తయారీ రంగంలోకి 100 శాతం ఎఫ్‌డీఐ!

Mon,August 12, 2019 02:06 AM

Govt may permit 100 Percent FDI in contract manufacturing

-అనుమతించే యోచనలో కేంద్ర ప్రభుత్వం

న్యూఢిల్లీ, ఆగస్టు 11: విదేశీ పెట్టుబడులను ఆకట్టుకోవడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం.. కాంట్రాక్టు తయారీ రంగంలోకి వందశాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అనుమతించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ఆటోమేషన్ రూట్‌లో అనుమతిస్తున్న విదేశీ ఇన్వెస్ట్‌మెంట్ పాలసీలో ఉన్న పలు ఆంక్షలను ఎత్తివేయడానికి చర్యలు తీసుకుంటున్నట్లు ఆ వర్గాలు తెలిపాయి. తయారీదారులకు చెందిన తమ ఉత్పత్తులు భారత్‌లో హోల్‌సేల్, రిటైల్ చానెళ్లు, ప్రభు త్వం అనుమతించిన ఈ-కామర్స్‌ల ద్వారా విక్రయించుకునేందుకు వీలుంటుంది. ప్రస్తుతం ఉన్న పాలసీతో కాంట్రాక్టు తయారీ సంస్థలతో ఎలాంటి సంప్రదింపులు జరుపాల్సిన అవసరం లేదు, అలాగే దీనికి ఎలాంటి నిర్వచనం లేకపోవడంతో వీటిని మార్చడానికి కేంద్రం సంకల్పించింది. కాంట్రాక్టు తయారీ రంగంలోకి వందశాతం ఎఫ్‌డీఐల అనుమతిపై వాణిజ్య, మంత్రిత్వ శాఖ ఆ దిశగా కసరత్తు చేస్తున్నదని, ఆ తర్వాత క్యాబినెట్ అనుమతికోసం పంపనున్నది. దీనిపై డెలాయిట్ ఇండియా భాగస్వామి రాజత్ వాహి మాట్లాడుతూ..ఈ నిర్ణయం తయారీ రంగానికి మరింత బూస్ట్‌నిచ్చినట్లు అవుతుందన్నారు. ఈ ప్రతిపాదనను స్వాగతిస్తున్నట్లు, గ్లోబల్ టెక్నాలజీ దిగ్గజాలైన యాపిల్ వంటి సంస్థలకు భారీ ఊరట లభించనున్నదని చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికిగాను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన సార్వత్రిక బడ్జెట్‌లో ఎంపిక చేసిన రంగాలతోపాటు విమానయానం, ఏవీజీసీ, బీమా, సింగిల్‌బ్రాండ్ రిటైల్ రంగాల్లో ఎఫ్‌డీఐల పరిమితిని ఎత్తివేయనున్నట్లు ప్రకటించారు.

174
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles