రూ.25 కోట్ల చోక్సీ ఆస్తులు జప్తు

Fri,July 12, 2019 12:16 AM

Enforcement Directorate attaches fugitive diamond jeweller Mehul Choksi s assets worth Rs 24.77 cr

న్యూఢిల్లీ, జూలై 11: ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) పరారీ రత్నాల వ్యాపారి మెహుల్ చోక్సీకి చెందిన మరో రూ.24.77 కోట్ల ఆస్తులను జప్తు చేసింది. ఇవన్నీ కూడా దేశ, విదేశాల్లో ఉన్నాయని గురువారం అధికారులు తెలిపారు. దుబాయ్‌లోని మూడు వాణిజ్య ఆస్తులుసహా ఓ మెర్సిడెస్ బెంజ్ కారు, కొన్ని డిపాజిట్లను అటాచ్ చేసినట్లు వివరించారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ) రూ.13,500 కోట్ల మోసంలో రత్నాల వ్యాపారి చోక్సీ కూడా ప్రధాన నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే.

ఈయన మేనల్లుడు, వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ మరో నిందితుడవగా, బ్రిటన్ జైలులో విచారణ ఖైదీగా ఉన్న సంగతీ విదితమే. ఈ కేసులో సీబీఐ ఎఫ్‌ఐఆర్ ఆధారంగా మనీ లాండరింగ్ కేసును నమోదు చేసిన ఈడీ.. విస్తృత స్థాయిలో దర్యాప్తు చేస్తున్నది. పీఎన్‌బీ మోసంలో చోక్సీ వాటా రూ.6,097.73 కోట్లుగా ఉండగా, ఇప్పటిదాకా ఆయనకు చెందిన రూ.2,534.7 కోట్ల ఆస్తులను ఈడీ స్వాధీనం చేసుకున్నది. ప్రస్తుతం చోక్సీ కరేబియన్ దీవుల్లో దాక్కోగా, అక్కడి పౌరసత్వాన్ని కలిగి ఉన్నాడు. స్థానికంగా పెట్టుబడుల ద్వారా ఈ హోదాను పొందినది తెలిసిందే.

248
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles