దివీస్ చీఫ్ మురళీ వేతనం రూ.59 కోట్లు

Mon,August 12, 2019 02:27 AM

Divis Labs Murali Divi was the highest earning pharma promoter

-దేశీయ ఫార్మారంగంలో ఇదే అత్యధికం

హైదరాబాద్, ఆగస్టు 11: హైదరాబాద్ కేంద్రస్థానంగా ఔషధ తయారీ సంస్థ దివీస్ ల్యాబోరేటరీస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ మురళీ కే దివీస్..దేశీయ ఫార్మా రంగంలో అత్యధిక వేతనం అందుకున్న వ్యక్తిగా రికార్డు సృష్టించారు. గడిచిన ఆర్థిక సంవత్సరానికిగాను ఆయన రూ.58.8 కోట్ల వేతనాన్ని అందుకున్నారు. దివీస్ ల్యాబ్ తాజాగా విడుదల చేసిన వార్షిక నివేదికలో ఈ విషయాన్ని వెల్లడించింది. అంతక్రితం ఏడాది అందుకున్న రెమ్యునరేషన్‌తో పోలిస్తే 46.3 శాతం అధికం. కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎన్‌వీ రమణకు రూ.30 కోట్ల వేతనాన్ని చెల్లించిన సంస్థ..హోల్‌టైం డైరెక్టర్ కిరణ్ ఎస్. దివీ(మురళీ తనయుడు) రూ.20 కోట్లు అందుకున్నారు. 2018-19లో మురళీ కమిషన్ కిందనే రూ.57.61 కోట్లు లభించడం విశేషం. అంతక్రితం ఏడాది రూ.40.20 కోట్ల వేతనంలో రూ.39 కోట్లు కమిషన్ రూపంలో వచ్చాయి. గతేడాదికిగాను సాధారణ ఉద్యోగి వేతనంలో 3.96 శాతం పెరుగుదల కనిపించింది. గడిచిన ఆర్థిక సంవత్సరానికి రూ.5,036 కోట్ల ఆదాయంపై రూ.1,333 కోట్ల పన్నులు చెల్లించిన తర్వాత నికర లాభాన్ని ఆర్జించింది. మిగతా ఫార్మా దిగ్గజాల వేతన విషయానికి వస్తే దేశంలో అతిపెద్ద ఔషధ సంస్థయైన సన్ ఫార్మాస్యూటికల్స్ ఫౌండర్, ఎండీ దిలీప్ సంఘ్వీ గతేడాదికిగాను రూ.1 వేతనం తీసుకోగా, ప్రోత్సహాకాల కింద మరో రూ.2,62,800 అందుకున్నారు. అలాగే అరబిందో ఫార్మా అధినేత ఎన్ గోవిందరాజన్ రూ.14.6 కోట్ల వేతనం పొందారు. కంపెనీకి వచ్చిన నికర లాభంలో ఒక్కశాతం గోవిందరాజన్‌కు వేతన రూపంలో లభించింది. గతేడాది సంస్థ రూ. 19,564 కోట్ల ఆదాయంపై రూ.2,356 కోట్ల లాభాన్ని గడించింది. అలాగే డాక్టర్ రెడ్డీస్ ల్యాబోరేటరిస్ కో-చైర్మన్, ఎండీ జీవీ ప్రసాద్‌కు కేవలం రూ.12.4 కోట్ల వేతనం లభించింది. ప్రసాద్ స్థానంలో సీఈవోగా నియమితులైన ఎరేజ్ ఇజ్రాయిల్‌కు రూ.7.75 కోట్లు రెమ్యునరేషన్ పొందారు. రూ.15,400 కోట్ల వార్షిక ఆదాయంపై రెడ్డీస్ రూ.1,880 కోట్ల నికర లా భాన్ని ఆర్జించింది. అలాగే సిప్లా ఎండీ, గ్లోబల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఉమాంగ్ వోహ్రా వేతనం అంతక్రితం ఏడాదితోపోలిస్తే 20.23 శాతం తగ్గి రూ.15.03 కోట్లకు పరిమితమైంది.

1345
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles