డిజిటల్ మీడియా@ 35 వేల కోట్లు

Tue,July 23, 2019 03:46 AM

Digital media is expected to reach  5.1 billion by 2021

2021 నాటికి చేరుకోనుందంటున్న ఫిక్కీ-ఈవై సర్వే

ముంబై, జూలై 22: దేశవ్యాప్తంగా ఇంటర్నెట్ వినియోగించే వారి సంఖ్య అంచనాలకుమించి పెరుగుతుండటంతో డిజిటల్ మీడియా మార్కెట్ శరవేగంగా దూసుకుపోతున్నది. ప్రస్తుత సంవత్సరంలో ఫిల్మ్ ఎంటర్‌టైన్‌మెంట్‌ను దాటేయనున్న డిజిటల్ మీడియా.. 2021 నాటికి 5.1 బిలియన్ డాలర్లకు చేరుకోనున్నదని ఫిక్కీ-ఈవై సంయుక్తంగా రూపొందించిన నివేదిక వెల్లడించింది. మన కరెన్సీలో ఇది రూ.35 వేల కోట్లకు పైమాటే. గతేడాది 2.5 బిలియన్ డాలర్లుగా ఉన్న సినిమా విభాగం..ఈ ఏడాది చివరినాటికి 2.8 బిలియన్ డాలర్లకు చేరుకోనున్నదని అంచనావేస్తున్నది. అలాగే 4.4 బిలియన్ డాలర్లుగా ఉన్న ప్రింట్ విలువ 2021 నాటికి 4.8 బిలియన్ డాలర్లకు ఎగబాకనున్నదని నివేదిక వెల్లడించింది. 2018లో 42 శాతం వృద్ధిని సాధించిన డిజిటల్ మీడియా 2.4 బిలియన్ డాలర్లకు చేరుకున్నది. భారతీయులు తమ మొబైళ్లలో ఎంటర్‌టైన్‌మెంట్ కోసం 30 శాతం ఖర్చు చేశారని తెలిపింది. సర్వేలోని పలు ముఖ్య అంశాలు..

-ప్రస్తుత సంవత్సరంలో డిజిటల్ మీడియా 3.2 బిలియన్ డాలర్లకు చేరుకోనున్నదని అంచనా.
-ప్రపంచ ఇంటర్నెట్ వినియోగదారుల్లో చైనా తర్వాత రెండోస్థానంలో ఉన్న భారత్‌లో 57 కోట్ల మంది యూజర్లు ఉన్నారు. ప్రతియేటా 13 శాతం చొప్పున పెరుగుతున్నారు.
-వీరిలో 32.5 కోట్ల మంది ఆన్‌లైన్ వీడియో చూస్తుండగా, 15 కోట్ల మంది ఆడియో స్ట్రీమింగ్ యూజర్లు.
-2021 నాటికి ఈ సంఖ్య 3-3.5 కోట్ల మంది ఓటీటీ వీడియో సబ్‌స్ర్కైబర్లు పెరుగనుండగా, 60-70 లక్షల మంది ఆడియో సబ్‌స్ర్కైబర్లు జతవనున్నారు.
-2.2 బిలియన్ డాలర్లుగా ఉన్న ప్రకటనల రూపంలో వచ్చే ఆదాయం వచ్చే రెండేండ్లలో రెండింతలు పెరిగి 4.3 బిలియన్ డాలర్లకు చేరుకోనున్నది
-వచ్చే ఐదేండ్లకాలంలో ఇంటర్నెట్ చూసే సమయం మూడు నుంచి 3.5 రెట్లు పెరుగనుండగా, ఇదే సమయంలో ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయం రెండు రెట్లు అధికమవనున్నది.

736
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles