ఇండిగోకు ‘బుల్‌బుల్‌' దెబ్బ రద్దయిన విమానాలు

Sat,November 9, 2019 11:29 PM

న్యూఢిల్లీ, నవంబర్‌ 9: దేశీయ విమానయాన దిగ్గజం ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు ‘బుల్‌బుల్‌' సెగ తగిలింది. తుపాన్‌ హెచ్చరికల మధ్య ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా విమానాలను ఇండిగో రద్దు చేసింది. ప్రయాణికులందరికీ ప్రత్యామ్నాయ ఏర్పాట్లనూ చేపట్టింది. పశ్చిమ బెంగాల్‌-బంగ్లాదేశ్‌ తీరప్రాంతాలపై బుల్‌బుల్‌ తుపాన్‌ ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ చెబుతుండగా, శనివారం రాత్రి 10 గంటల నుంచి ఆదివారం తెల్లవారుజాము 4 గంటల వరకు కుండపోతగా వర్షాలు కురిసే వీలున్నదని అంచనాలు వచ్చాయి. ఈ సమయంలో గంటకు 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీంతో ప్రభావిత ప్రాంతాల్లో ఇండిగో తమ సర్వీసులను రద్దు చేసుకున్నది.

240
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles