నిరాశపరిచిన కోరమాండల్

Tue,July 23, 2019 03:00 AM

CHECK OUT THE LOSERS FOR WEEK ENDING JULY 19 2019

హైదరాబాద్, జూలై 22: ప్రముఖ వ్యవసాయ ఉత్పత్తుల సంస్థ కోరమాండల్ ఇంటర్నేషనల్ నిరాశాజనక ఆర్థిక ఫలితాలను నమోదు చేసుకున్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికిగాను సంస్థ రూ.62.43 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని ఆర్జించింది. అంతక్రితం ఏడాది ఇదే కాలానికి నమోదైన రూ.90.21 కోట్లతో పోలిస్తే 31 శాతం క్షీణత కనబరిచింది. ఆదాయం తగ్గుముఖం పట్టడం లాభాల్లో ప్రతికూల వృద్ధి నమోదైందని కంపెనీ వర్గాలు వెల్లడించాయి. ఏప్రిల్-జూన్ మధ్యకాలానికి ఆదాయం కూడా రూ.2,537.29 కోట్ల నుంచి రూ.2,140.70 కోట్లకు పడిపోయినట్లు సంస్థ బీఎస్‌ఈకి సమాచారం అందించింది. నిర్వహణ ఖర్చులు రూ.2,404.54 కోట్ల నుంచి రూ.2,045.51 కోట్లకు తగ్గాయి. ఈ సందర్భంగా కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ సమీర్ గోయల్ మాట్లాడుతూ..వర్షాలు ఆలస్యంగా తక్కువగా కురవడంతో తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొవాల్సి వచ్చిందని, భవిష్యత్తులో ఈ ప్రభావం మరింత పడే అవకాశం ఉందన్నారు. ఎరువుల సామర్థ్యాన్ని పెంచడానికి పెట్టుబడులను పెట్టనున్నట్లు ప్రకటించిన ఆయన..న్యూట్రియంట్, ఇందుకు సంబంధించిన రంగాల పనితీరు ఆశావాదంగా ఉన్నదని, పంట సంహరక్షణ విభాగం తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొవాల్సి వచ్చిందని ఒక ప్రకటనలో వెల్లడించారు. జూన్ నెలలో తిరిగి ప్రారంభమైన సరిగమ్ ప్లాంట్ ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో ఉత్పత్తి చేయడం లేదన్నారు.

250
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles