HomeBusiness News

సీసీఎల్‌ రూ.140 కోట్ల పెట్టుబడి

Published: Wed,August 14, 2019 03:36 AM
  Increase Font Size Reset Font Size decrease Font size   

హైదరాబాద్‌, ఆగస్టు 13: హైదరాబాద్‌ కేంద్రస్థానంగా ఇన్‌స్టాంట్‌ కాఫీ తయారీ సంస్థ సీసీఎల్‌ ప్రొడక్ట్స్‌(ఇండియా) లిమిటెడ్‌(గతంలో కాంటినెంటల్‌ కాఫీ)..ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వ్యాపారాన్ని విస్తరించడానికి 20 మిలియన్‌ డాలర్ల పెట్టుబడులు పెట్టబోతున్నట్లు ప్రకటించింది. మన కరెన్సీలో ఇది రూ.140 కోట్లకు పైమాటే. వీటిలో 12 మిలియన్‌ డాలర్ల నిధులను చిత్తూరు జిల్లాలో ఉన్న ప్లాంట్‌లో ప్యాకేజింగ్‌ యూనిట్‌ను నెలకొల్పడానికి, 8 మిలియన్‌ డాలర్ల నిధులను వియత్నాంలో ఉన్న ప్లాంట్‌ కెపాసిటీని విస్తరించడానికి వినియోగించనున్నట్లు కంపెనీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ శ్రీశాంత్‌ వెల్లడించారు. ఈ నిధులను అంతర్గత వనరుల ద్వారా సేకరించనున్నట్లు, ప్రస్తుతానికి బ్యాంకుల వద్ద రుణాలు తీసుకునే అవకాశం లేదని ఆయన స్పష్టంచేశారు.

ప్రస్తుతం సంస్థకు గుంటూరు జిల్లాలోని దుగ్గిరాల వద్ద ఉన్న ప్లాంట్‌తోపాటు స్విట్జర్లాండ్‌, వియత్నాంలలో ఉన్న ప్లాంట్లలో ప్రతియేటా 35 వేల టన్నుల ఇన్‌స్టాంట్‌ కాఫీని ఉత్పత్తి చేస్తున్నట్లు ఆయన చెప్పారు. కంపెనీ కాఫీకి మార్కెట్లో మరింత ప్రచారం కల్పించడానికి ప్రముఖ హీరోయిన్‌ నిత్యామీనన్‌ను బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమించుకున్నది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వచ్చే మూడేండ్లకాలంలో అప్పులు లేని సంస్థగా తీర్చిదిద్దనున్నట్లు చెప్పారు. దక్షిణాది మార్కెట్లో తన ఉత్పత్తులను విక్రయిస్తున్న సంస్థ..2021 నాటికి దేశవ్యాప్తంగా విస్తరించాలనుకుంటున్నట్లు చెప్పా రు. ప్రస్తుతం 90 దేశాలకు కాఫీని ఎగుమతి చేస్తున్న సంస్థ.. వచ్చే రెండు నుంచి మూడేండ్లకాలంలో మరో 20 దేశాలకు ఎగుమతి చేయాలనుకుంటున్నది.

309

Recent News