కెనరా బ్యాంక్ వడ్డీరేట్ల తగ్గింపు

Sat,August 10, 2019 12:49 AM

Canara Bank cuts lending rates by 10 basis points

-10 బేసిస్ పాయింట్లు తగ్గించిన బ్యాంక్
బెంగళూరు, ఆగస్టు 9: రిజర్వు బ్యాంక్ తగ్గించిన వడ్డీరేట్లను వినియోగదారులకు బదలాయించడంలో భాగంగా ప్రభుత్వరంగ సంస్థయైన కెనరా బ్యాంక్ మార్జినల్ కాస్ట్ ఆఫ్ లెండింగ్ రేటు(ఎంసీఎల్‌ఆర్)ను 10 బేసిస్ పాయింట్లు తగ్గించింది. ఈ నెల 7 నుంచే అమలులోకి వచ్చిన ఈ వడ్డీరేట్లు అన్ని రకాల రుణాలకు వర్తించనున్నది. దీంతో గడిచిన ఆరు నెలల్లో బ్యాంక్ 20 బేసిస్ పాయింట్లు వడ్డీరేట్లను తగ్గించినట్లు అయింది. బ్యాంక్ తీసుకున్న తాజా నిర్ణయంతో ఏడాది కాలపరిమితి కలిగిన రుణాలపై వడ్డీరేటు 8.70 శాతం నుంచి 8.50 శాతానికి తగ్గింది. బెంగళూరు కేంద్రంగా బ్యాంకింగ్ సేవలు అందిస్తున్న బ్యాంక్..మరోసారి వడ్డీరేట్లు తగ్గించే అవకాశాలున్నాయని సంకేతాలిచ్చింది.

199
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles