సుప్రీం తీర్పుపై పరిశ్రమ హర్షం

Sat,November 9, 2019 11:40 PM

న్యూఢిల్లీ, నవంబర్‌ 9: అయోధ్య భూ వివాదంపై సుప్రీం ఇచ్చిన తీర్పును దేశీయ వ్యాపార, పారిశ్రామిక రంగం స్వాగతించింది. దశాబ్దాల తరబడి రగులుతున్న ఈ రామజన్మభూమి-బాబ్రీమసీదు కేసులో శనివారం అత్యున్నత న్యాయస్థానం అంతిమ తీర్పు వెలువరించింది. దీనిపై సామాజిక మాధ్యమాల్లో పరిశ్రమ స్పందించింది.


‘సుప్రీం కోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం. ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం ధైర్యాన్ని అంతా అభినందించాల్సిందే. వారి కర్తవ్యానికి నా అభివాదం’
- ఆనంద్‌ మహీంద్రా, మహీంద్రా గ్రూప్‌ చైర్మన్‌
Sajjan-Jindal
‘దశాబ్దాల తరబడి నడుస్తున్న ఓ వివాదం ఎట్టకేలకు ముగిసిపోయింది. సుప్రీం ధర్మాసనానికి నా అభివాదాలు. ఇలాంటి సమయంలోనే దేశ సమైక్యతను చాటుకోవాలి’
- సజ్జన్‌ జిందాల్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ సీఎండీ

‘సుప్రీం కోర్టు గొప్ప తీర్పును ప్రకటించింది. ఈ తీర్పును గౌరవిస్తున్నాం. దేశంలోని ప్రతీ పౌరునికి లభించిన విజయమిది. అంతా కలిసి ముందుకెళ్దాం’
- డీకే అగర్వాల్‌, పీహెచ్‌డీ చాంబర్‌ అధ్యక్షుడు

‘ఇరు వర్గాలకు న్యాయం జరిగేలా అత్యున్నత న్యాయస్థానం సూచనలు చేసింది’
- యూఎస్‌ అవస్తి, ఇఫ్కో ఎండీ

225
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles