జెట్ రేసులో అనిల్ అగర్వాల్!

Mon,August 12, 2019 02:09 AM

Anil Agarwals family trust in the race for Jet Airways

న్యూఢిల్లీ, ఆగస్టు 11: వేదాంత లిమిటెడ్ చైర్మన్, బిలియనీర్ అనిల్ అగర్వాల్ కుటుంబ ట్రస్టు వోకల్ ఇన్వెస్ట్‌మెంట్స్.. జెట్ ఎయిర్‌వేస్ కొనుగోలుకు ప్రయత్నిస్తున్నది. పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయి ఈ ఏడాది ఏప్రిల్‌లో విమానయాన సేవలకు జెట్ ఎయిర్‌వేస్ దూరమైన విషయం తెలిసిందే. కాగా, పనామాకు చెందిన ఇన్వెస్ట్‌మెంట్ గ్రూప్ అవంతులో, రష్యా ఫండ్ ట్రెజరీ ఆర్‌ఏ క్రియేటర్‌లు కూడా జెట్‌ను దక్కించుకునేందుకు పోటీపడుతున్నాయి. ఈ నెల 10తోనే జెట్ కొనుగోలుకు సంబంధించి ఆసక్తిని వ్యక్తీకరించేందుకు (ఈవోఐ) ఉన్న గడువు ముగిసిపోగా, వోకల్ రాకతో మొత్తం ఈ రేసులో మూడు సంస్థలు నిలిచినైట్లెంది. ఎతిహాద్ ఎయిర్‌వేస్, హిందుజా గ్రూప్‌లూ జెట్ కొనుగోలుకు మొదట్లో ఆసక్తి చూపినా.. ఆ తర్వాత వెనుకకు తగ్గాయి. దీంతో జెట్‌కు రుణాలిచ్చిన బ్యాంకులు దివాలా కోర్టుల్ని ఆశ్రయించాల్సి వచ్చింది.

260
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles