రెండు రోజుల్లో 22 వేల మంది

Fri,November 8, 2019 12:15 AM

-వీఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేసుకున్న బీఎస్‌ఎన్‌ఎల్ ఉద్యోగులు
న్యూఢిల్లీ, నవంబర్ 7: ప్రభుత్వరంగ టెలికం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ ప్రకటించిన స్వచ్ఛంద పదవీ విరమణ పథకానికి(వీఆర్‌ఎస్) ఉద్యోగుల నుంచి విశేష స్పందన లభించింది. గడిచిన రెండు రోజుల్లోనే ఏకంగా 22 వేల మంది దరఖాస్తు చేసుకున్నట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. సంస్థలో పనిచేస్తున్న 1.50 లక్షల మందిలో లక్ష మంది సిబ్బంది వీఆర్‌ఎస్ తీసుకోవడానికి అర్హులు. ఈ నెల 5న ప్రారంభమైన ఈ వీఆర్‌ఎస్ పథకం డిసెంబర్ 3న ముగియనున్నది. వీఆర్‌ఎస్ స్కీం కింద 77 వేల మంది సిబ్బంది లక్ష్యంగా పెట్టుకోగా..తొలి రెండు రోజుల్లోనే 22 వేల మంది ఆసక్తి చూపినట్లు పేరు చెప్పని కంపెనీ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. వీరిలో 13 వేల మంది గ్రూపు సీ ఉద్యోగులు. ఈ వీఆర్‌ఎస్ స్కీం ద్వారా ప్రతియేటా సంస్థకు రూ.7 వేల కోట్ల నిధులు మిగులనున్నాయి.

390
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles