ప్ర‌పంచంలోనే తొలి 1టీబీ ఎస్‌డీఎక్స్‌సీ కార్డును విడుద‌ల చేసిన లెగ్జార్


Thu,January 10, 2019 12:19 PM

లాస్ వెగాస్‌లో జ‌రుగుతున్న క‌న్‌జ్యూమ‌ర్ ఎల‌క్ట్రానిక్స్ షో (సీఈఎస్‌) 2019లో లెగ్జార్ కంపెనీ 1టీబీ కెపాసిటీ ఉన్న ప్ర‌పంచంలోనే తొలి ఎస్‌డీఎక్స్‌సీ కార్డును విడుద‌ల చేసింది. ఈ కార్డు ప్ర‌స్తుతం వినియోగ‌దారుల‌కు మార్కెట్‌లో ల‌భిస్తున్న‌ది. దీని ధ‌ర 507 డాల‌ర్లు (సుమారుగా రూ.35,756). ఇక ఈ కార్డులో 650 నిమిషాల నిడివి ఉన్న 4కె వీడియో ఫుటేజ్‌ను స్టోర్ చేసుకోవ‌చ్చు. అలాగే ఈ కార్డులో 95 ఎంబీ ప‌ర్ సెకండ్ స్పీడ్ తో డేటా రీడ్ అవుతుంది. గ‌తంలో సాన్ డిస్క్ 1టీబీ కెపాసిటీ ఉన్న ఎస్‌డీ కార్డును విడుద‌ల చేయ‌గా, ఇప్పుడు లెగ్జార్ అంతే కెపాసిటీ ఉన్న ఎస్‌డీ ఎక్స్‌సీ మెమొరీ కార్డును విడుద‌ల చేయ‌డం విశేషం.

1451

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles