ఓ సైకిల్ గుద్దితే కారు ఎలా అయిపోయిందో చూడండి.. వీడియో

Fri,January 4, 2019 04:49 PM

Car damaged by bicycle hit in china Photo gone viral

కారు వచ్చి సైకిల్‌ను ఢీకొట్టినా, సైకిల్ వచ్చి కారును ఢీకొట్టినా కారుదే తప్పంటారు.. పైగా నష్టం కూడా ఎక్కువగా సైకిల్‌కే జరుగుతుంది. కానీ చైనాలో మాత్రం దీనికి పూర్తి రివర్స్‌లో జరిగింది. అక్కడ ఇప్పుడో ఫొటో వైరల్‌గా మారిపోయింది. పైనున్న ఫొటో కూడా అదే. ఆఫ్టరాల్ ఓ సైకిల్ వచ్చి గుద్దితే కారు ఎలా అయిపోయిందో చూశారు కదా. నిజానికి ఇది ఫేక్ ఫొటోనేమో అని మొదట్లో అనుకున్నారు. కానీ పోలీసులు కూడా ఇది నిజమేనంటూ ఓ వీడియోను రిలీజ్ చేయడం విశేషం. ఓ సైకిల్ వచ్చి ఢీకొంటే కారు బంపర్ మొత్తం నుజ్జయిపోయింది. సైకిల్ మాత్రం చెక్కు చెదరకుండా ఉంది. చైనాలో షెన్‌జెన్ నగరంలో ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదం సైకిల్ నడుపుతున్న వ్యక్తికి మాత్రం స్వల్ప గాయాలయ్యాయి.

7653
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles