పోపుల డబ్బాతో చలికి చెక్..


Sun,January 6, 2019 12:09 PM

చలికాలంలో తరుచూ జలుబు, దగ్గు వస్తుండడం మ నం చూస్తుంటాం. శరీరం బద్ధ్దకించడం, జీర్ణవ్యవస్థ మందగించడం, నీరసంగా అనిపించడం..ఇలా పలు రకాల అస్వస్థ్ధతలకులోనైతే వంటింటి సామగ్రితోనే వైద్యం చేసుకోవచ్చని చెబుతున్నారు. ప్రకృతి వైద్యులు తరుచూ వైద్యులను ఆశ్రయించకుండా చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే మంచి ఫలితం ఉంటుందని పేర్కొంటున్నారు. మనం రోజు ఉపయోగించే పోపు దినుసులే మందుగా పనిచేస్తాయని, సీజనల్ వ్యా ధులకు అడ్డుకట్టు వేయవచ్చని వివరిస్తున్నారు.

ఎల్లిపాయలను మరవద్దు..


చలికాలంలో రక్తనాళాలు మూసుకుపోకుండా సడలింపజేసేందుకు ఎల్లిపాయలు ఎంతో ఉపయోగపడతా యి. తగిన మోతాదులో ఆహా రంలో వీటిని తీసుకుంటే రక్తప్రసరణ మెరుగవుతుందనీ, కాస్త వేడి నిస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.

ఎండు మిర్చితో ఎంతో మేలు..


సైనస్, దగ్గు, జలుబు నివారణకు యాలకులు కూడా దోహద పడతాయి. చలికాలంలో వాతావరణ మార్పులు కారణంగా శరీరం బద్దకించడం మాములుగా కనిపిస్తూనే ఉంటుంది. ఇలాంటి సమ యంలో గ్లాసు నీటిలో రెండు యాలకులు వేసి మరిగించి చల్లారాక తాగితే ఉత్జేంగా ఉంటుంది. దీనికి కొంచేం తేనె కలిపి పడుకునే ముందు తాగితే మరింత ఫలితం ఉంటుందని ప్రకృతి వైద్యులు చెబుతున్నారు.

అజీర్తికి ఉందిగా బెల్లం..


అజీర్తితో బాధపడుతున్నారా.. భోజనం చేశాక చిన్న బెల్లం ము క్కును నోట్లో వేసుకొని చప్పరిస్తే సరిపోతుందని పేర్కొంటున్నారు. వా నాకాలం, శీతాకాలం తరుచూ ఇబ్బంది పెట్టే జలుబు ఉపశమనం కోసం అల్లం పాడిలో బెల్లం కలిపి తీసుకుంటే మంచి ఫలితం ఉం టు ంది. అదే గొంతు గరగర ఉన్నా జీర్ణవ్యవస్థ్ధ మందగించినా శాంతి పొ డిలో బెల్లం కలిపి తింటే మెరగవుతుంది.

పసుపు కలిపి తీసుకుంటే..


ఎవరైనా గాయం తగిలి రక్తం కారుతున్నదంటే ముందుగా గుర్తొచ్చేది పసుపే, తగిలిన చోట కొంచెం రాస్తే గడ్డకట్టుకుపోతుంది. చిన్న చిన్న గాయాలైతే ఎలాంటి మందుల వాడకపోయినా దీంతో నయమైపోతుంది. ఎన్నో ఔషద గుణాలున్న పసుపు రోగ నిరోధక శక్తి పెంపొందుటకు తోడ్పడుతుంది జలుబు,దగ్గు లక్షణాలు కనిపించగానే ఉదయం, రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని పాలల్లో చిటికెడు పసు పు కలుపుకుని తాగితే ఫలితముంటుంది. తేనెలో కలిపి తీసుకున్నా ఉపశమనం కలుగుతుంది.

నీరసానికి దాల్చిన చెక్క..


బిర్యానీ, బగారా తయారీలో దాల్చిన చెక్కను ఎక్కువగా విని యోగిస్తారు. ఈ చెక్కను మంచి వాసనే కాదు ఔషధ గుణాలూ ఎక్కు వగానే ఉన్నాయి. మధుమేహం ఉన్న వారికి ఇది ఎంతో మేలు చేస్తుంది. మెదడు పనితీరును మెరుగు పరిచేందుకు, నీరసాన్ని దూరం చేసేందుకు పనిచేస్తుంది. చిన్నపాటి ముక్కను నోట్లో వేసుకొని మెల్లగా నమిలితే నోటి దుర్వాసన పోవడమా కాదు. శరీరం చురుగ్గా కదులుతుంది.

పైత్యానికి వాడండి అల్లం..


కూరలు ముఖ్యంగా మాంసాహారం రుచిగా ఉండేందుకు అల్లం, ఎల్లిపాయ మిశ్రమాన్ని ఎక్కువగా వాడుతుండడం మనం చూస్తుంటాం.

3776

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles