HomeLATEST NEWStharun bhasker act as a hero in vijay production

పెళ్లి చూపులు ద‌ర్శ‌కుడు హీరోగా విజ‌య్ దేవ‌ర‌కొండ సినిమా

Published: Thu,January 10, 2019 12:18 PM
  Increase Font Size Reset Font Size decrease Font size   
ప్ర‌సుతం ఇండ‌స్రీలో ఉన్న సెల‌బ్రిటీలు కేవ‌లం ఒక్క రంగానికే పరిమితం కాకుండా వివిధ రంగాల‌లో త‌మ టాలెంట్‌ని నిరూపించుకుంటున్నారు. హీరోలు ద‌ర్శ‌కులుగా, నిర్మాత‌లుగా మారి స‌రికొత్త చిత్రాల‌ని ప్రేక్ష‌కుల ముందుకు తెచ్చే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఈ క్ర‌మంలో అతి త‌క్కువ స‌మ‌యంలో ఫుల్ పాపులారిటి తెచ్చుకున్న విజ‌య్ దేవ‌ర‌కొండ నిర్మాత‌గా మారి సినిమాలు చేస్తున్నాడు. మొద‌ట కింగ్ ఆఫ్ ది హిల్ అనే బేన‌ర్‌లో నోటా సినిమాని రిలీజ్ చేశాడు. ఈ సినిమా విజ‌యం సాధించలేక‌పోయింది. అయితే ఈ సారి ఆయ‌న నిర్మించే సినిమాలో హీరో ఎవ‌రో తెలిస్తే అంద‌రు షాక్ అవుతారు .పెళ్లి చూపులు సినిమాతో హీరోగా విజ‌య్ దేవ‌ర‌కొండ‌ కెరీర్‌కి బీజం వేసిన ద‌ర్శ‌కుడు త‌రుణ్ భాస్క‌ర్ అని ప్ర‌చారం జ‌రుగుతుంది. త‌రుణ్‌కి ఎప్ప‌టి నుండో హీరోగా చేయాల‌నే ఇంట్రెస్ట్ ఉన్న నేప‌థ్యంలో విజ‌య్ దేవ‌రకొండ త‌న ప్రొడ‌క్ష‌న్‌లో సినిమా చేయ‌బోతున్న‌ట్టు తెలుస్తుంది. ప్ర‌స్తుతం ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతుండ‌గా, త్వ‌ర‌లోనే అధికారిక ప్ర‌క‌ట‌న రానుంద‌ని అంటున్నారు. విజ‌య్ ప్ర‌స్తుతం డియ‌ర్ కామ్రేడ్ చిత్రంతో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే.
2346
Tags

More News

NATIONAL-INTERNATIONAL

SPORTS

Health

Technology