నేవీలో స్పోర్ట్స్ కోటా పోస్టులు


Mon,January 7, 2019 12:43 AM

భారత రక్షణశాఖ పరిధిలోని ఇండియన్ నేవీ (ఐఎస్) సెయిలర్ పోస్టుల భర్తీకి స్పోర్ట్స్ కోటా ఎంట్రీ-1/2019 బ్యాచ్‌లో చేరటానికి అవివాహిత పురుషుల నుంచి ఇండియన్ నేవల్ అకాడమీ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
INDIAN-NAVY-SPORTS
-స్పోర్ట్స్ విభాగాలు: అథ్లెటిక్స్, ఆక్వాటిక్స్, బాస్కెట్‌బాల్, బాక్సింగ్, క్రికెట్, ఫుట్‌బాల్, జిమ్నాస్టిక్స్, హ్యాండ్‌బాల్, హాకీ, కబడ్డీ, వాలీబాల్, వెయిట్‌లిఫ్టింగ్, రెజ్లింగ్, స్క్వాష్, బెస్ట్ ఫిజిక్యూ, కయాకింగ్/కనోయింగ్, ఫెన్సింగ్, గోల్ఫ్, టెన్నిస్, రోయింగ్, షూటింగ్, సెయిలింగ్ అండ్ విండ్ సర్ఫింగ్, ఈక్వెస్ట్రెయిన్(హార్స్‌పోలో)
పోస్టులవారీగా అర్హతలు
-డైరెక్ట్ ఎంట్రీ పెట్టీ ఆఫీసర్: ఏదైనా గ్రూప్‌లో ఇంటర్ లేదా 10+2 లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణత.
-సీనియర్ సెకండరీ రిక్రూట్‌మెంట్ (ఎస్‌ఎస్‌ఆర్): ఏదైనా గ్రూప్‌లో ఇంటర్ లేదా 10+2 లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణత.
-మెట్రిక్ రిక్రూట్స్ (ఎంఆర్): పదోతరగతి/తత్సమాన పరీక్ష ఉత్తీర్ణత.
గమనిక: సంబంధిత క్రీడల్లో అంతర్జాతీయ/ జూనియర్ లేదా సీనియర్, నేషనల్ చాంపియన్‌షిప్, సీనియర్ స్టేట్ చాంపియన్‌షిప్, ఆల్ ఇండియా యూనివర్సిటీ చాంపియన్‌షిప్ స్థాయిలో పాల్గొన్న క్రీడాకారులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
-వయస్సు: డైరెక్ట్ ఎంట్రీ పెట్టీ ఆఫీసర్‌కు 17 నుంచి 22 ఏండ్ల మధ్య, మిగతా పోస్టులకు 17 నుంచి 21 ఏండ్ల మధ్య ఉండాలి.
-శారీరక ప్రమాణాలు: ఎత్తు: 157 సెం.మీ. ఎత్తుకు తగ్గ బరువు, ఛాతీ ఉండాలి. గాలి పీల్చినప్పుడు కనీసం 5 సెం.మీ వ్యాకోచించాలి.
-పే&అలవెన్సులు: ట్రెయినింగ్‌లో నెలకు రూ. 14,600/- స్టయిఫండ్ ఇస్తారు. శిక్షణ తర్వాత రూ. 21,700-43,100 + రూ. 5,200/- ఎంఎస్‌పీ+ డీఏ చెల్లిస్తారు.
-పదోన్నతులు: సెయిలర్ నుంచి మాస్టర్ చీఫ్ పెట్టీ ఆఫీసర్-1 (సుబేదార్‌కు సమాన స్థాయి) వరకు ఉంటుంది.
-ఎంపిక విధానం: రాతపరీక్ష, ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్, స్పోర్ట్స్ ట్రయల్స్ ద్వారా
-అర్హత కలిగిన అభ్యర్థులను ప్రత్యేకమైన నేవల్ కేంద్రాలల్లో ట్రయల్స్ కోసం పిలుస్తారు. ట్రయల్స్‌లో క్వాలిఫై అయిన అభ్యర్థులు, ఐఎన్‌ఎస్ హమ్లా, ముంబై వద్ద వైద్య పరీక్షలకు హాజరుకావాలి.
-శిక్షణ: బేసిక్ ట్రెయినింగ్‌ను ఐఎన్‌ఎస్ చిల్కాలో ఇస్తారు.
-దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
-దరఖాస్తులకు చివరితేదీ: జనవరి 26
-వెబ్‌సైట్: www.joinindiannavy.gov.in

222
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles