ఆఫ్ఘన్‌లో బంగారు గని కూలి 30 మంది మృతి

Mon,January 7, 2019 12:41 AM

40 people killed in Afghan gold mine collapse

కుందుజ్, జనవరి 6: ఆఫ్ఘనిస్థాన్‌లో బంగారు గని కుప్పకూలడంతో 30 మంది మరణించారు. ఏడుగురు గాయపడ్డారు. ఈ సంఘటన ఆదివారం బదక్షాన్ రాష్ట్రంలోని కొహిస్థాన్ జిల్లాలో చోటుచేసుకుంది. నదీ పరివాహకం వెంట దాదాపు 200 అడుగుల లోతున్న గనిలో కార్మికులు బంగారం కోసం వెతుకుతుండగా అది కుప్పకూలిందని అధికారులు చెప్పారు. అయితే గని కుప్పకూలడానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని పేర్కొన్నారు. మృతిచెందిన వారంతా వృత్తిపరమైన కార్మికులు కాదని తెలిపారు. గ్రామస్థులంతా చాలా కాలం నుంచి అక్రమంగా బంగారు గనుల తవ్వకాలకు పాల్పడుతున్నారని, దీనిపై ప్రభుత్వ నియంత్రణ లేదని చెప్పారు.

251
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles