సరికొత్త ప్రేమకథ!


Fri,January 11, 2019 11:12 PM

raj raave naa cheliya log lunch

నెమలి అనిల్, సుభాంగి పంత్ జంటగా నటిస్తున్న చిత్రం రావే రా చెలియా. ఎన్. మహేశ్వర్‌రెడ్డి దర్శకుడు. సూర్యచంద్ర ప్రొడక్షన్స్ పతాకంపై నెమలి అనిల్, నెమలి శ్రవణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్ర టైటిల్ లోగోను శుక్రవారం హైదరాబాద్‌లో నిర్మాత రాజ్ కందుకూరి విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ టైటిల్ ఆకట్టుకునే విధంగా వుంది. సినిమా కూడా అదే స్థాయిలో వుంటుందని భావిస్తున్నాను. సినిమాలో కంటెంట్ వుంటే కచ్చితంగా విజయం సాధిస్తుంది అన్నారు. హీరోగా ఇది నా మొదటి సినిమా. కథ బాగుందంటే ప్రేక్షకులు చిత్రాన్ని ఆదిరిస్తున్నారు. సరికొత్త ప్రేమకథ నేపథ్యంలో ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుంది అని హీరో నెమలి అనిల్ పేర్కొన్నారు.

1206

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles